కాబోయే భర్తను చంపేసి.. ఇన్స్టాగ్రామ్ లో కన్నీళ్లు
Ketan Agarwal Pune Murder : ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానాలు, రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా నవంబర్‌లో రాయల్ వెడ్డింగ్‌కు ఇరువైపులా కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. ఆ కోటీశ్వరుడైన యువ వ్యాపారవేత్త మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటపై నుంచి లోయలో పడి మరణించాడు. అయితే తనను ఫొటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడి చనిపోయాడని.. కాబోయే భార్య చెప్పింది. కానీ ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆమెనే అతడిని లోయలోకి తోసి చంపినట్లు తేలింది. అయితే ఆమెనే తన స్నేహితుడి సాయంతో కాబోయే భర్తను చంపి.. ఆపై సోషల్ మీడియాలో పెద్ద డ్రామానే చేసింది. నా పుట్టిన రోజు నాడే నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయావా అంటూ కన్నీరు కార్చి.. మహానటిలా బిల్డప్ ఇచ్చింది. తానే తోసేసి.. పడిపోయాడంటూ నమ్మబలికి!పూణే జిల్లా గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్.. తన టుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18వ తేదీన కాబోయే భార్య పుట్టిన రోజు ఉండండతో.. సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు కేతన్. అయితే అప్పటికే ఆమె యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రసిద్ధ లోహ్‌గఢ్ కోటకు వెళ్దామని చెప్పగా.. సరేనన్నాడు. చూస్తుండగానే పుట్టిన రోజు రావడం, కేతన్ ఆమెతో అక్కడి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే అక్కడే కేతన్.. తన భార్యను ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఈక్రమంలోనే సియా తన ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరి (22)తో కలిసి కేతన్‌ను వెనుక నుంచి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. ఆ తర్వాత లోనావాలా రూరల్ పోలీసులకు ఫోన్ చేసి, బలమైన గాలుల వల్ల కేతన్ అదుపుతప్పి లోయలో పడిపోయాడంటూ నమ్మించి యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేయించింది.చంపేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కపట ప్రేమ నాటకం!కేతన్ మరణవార్త బయటకు