
నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజు నియమితులయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న ఈయనను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండగా, కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజుతో పాటు జయేశ్‌రంజన్ పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.