
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tungabhadra Dam Gates Open: మూడు రాష్ట్రాల మధ్య పారుతున్న తుంగభద్ర నదిపై ఏర్పాటుచేసిన ప్రాజెక్టు గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఎల్లుండి జరగనున్న తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యామ్ గేట్ కూలిపోవడంతో ఆ ప్రాజెక్టును కొత్తగా బిగించారు. డ్యామ్ గేట్ల పనులు పూర్తవడంతో తుంగభద్ర డ్యామ్ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయినిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు తిరిగి పూర్వ వైభవం సంతరించుకోనుంది. కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపుదిద్దుకున్న తుంగభద్ర ప్రాజెక్టు ఎల్లుండి అంటే గురువారం ప్రారంభం కానుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా.. వీటిని ఈ నెల 25వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రి శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తోపాటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. తెలంగాణలో కొన్ని వేలల్లో జీవనాడీగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి వృథాను అడ్డుకునేందుకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటును బిగించారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇవ్వడంతో కొత్త గేట్లు అమర్చారు. 6 నెలల్లో కొత్త గేట్లను అమర్చడంతో ఏపీ-కర్నాటక రాష్ట్రాల్లో తుంగభద్ర ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసుకుంది.
ఏపీలో లక్షల ఎకరాలకు నీరు కృష్ణానది ఉప నది తుంగభద్ర నది కర్ణాటక నుంచి ఏపీతోపాటు తెలంగాణలో కొంత భాగం పారుతుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టు ఏపీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఏపీలో 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు లభిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగు నీరు అందుతోంది. 25వ తేదీన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్పేటలో జరిగే బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.