
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.భారీగా పారిశ్రామిక పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సిఫారసు చేసిన పలు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.39,355 కోట్ల పెట్టుబడులతో, 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:ప్రీమియర్ ఎనర్జీస్ (తిరుపతి): రూ.3,936 కోట్ల పెట్టుబడితో సిలికాన్ వేఫర్, మాడ్యూల్ తయారీ యూనిట్. 540 మందికి ఉపాధి.కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ (అనకాపల్లి): రూ.2,788 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్.ప్రొటేరియల్ ఇండియా (అనకాపల్లి): రూ.2,250 కోట్ల పెట్టుబడితో నియోడిమియం ఐరన్ బోరాన్ మాగ్నెట్ తయారీ పరిశ్రమ. 530 మందికి ఉపాధి.SFVONE ఇండియా (కాకినాడ): రూ.1,900 కోట్ల పెట్టుబడితో వాడిన వంట నూనెల నుంచి విమాన ఇంధనం తయారు చేసే యూనిట్. 2,500 మందికి ఉపాధి.ఎన్ఎస్ మాగ్నటెక్ (తిరుపతి): రూ.1,250 కోట్ల పెట్టుబడితో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ. 400 మందికి ఉపాధి.ఏపీ జేఎస్డబ్ల్యూ స్టీల్ (ప్రకాశం): రూ.1,230 కోట్లతో స్టీల్