విజయవాడలోని కృష్ణ లంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండైన సీఐ నాగరాజు అరెస్టయ్యారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు తాజాగా పోలీసులు తెలిపారు.
నాగరాజును మంగళవారం దాదాపు 5 గంటలపాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. వివిధ అంశాలపై సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యం, తదనంతర పరిణామాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఅండ్ఎల్ విభాగం ఐజీ ఎం.రవిప్రకాశ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీఐ నాగరాజు అరెస్టు |