ఎవరైనా మిమ్మల్ని కలిసినప్పుడు చిరునవ్వుతో వారితో మాట్లాడండి. చిరునవ్వుతో పలకరించండి. దీంతో వారికి మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎదుటి వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. మధ్యలో అడ్డు చెప్పవద్దు.
దీంతో వారికి మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు.
వయసు, హోదాతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. దీంతో అందరికీ మీరు నచ్చుతారు.
నిజాయితీగా ఉన్న వ్యక్తులపై నమ్మకం పెరుగుతుంది. నిజాయితీగా ఉండే వ్యక్తులను అందరూ ఇష్టపడతారు. ప్రేమ, గౌరవం కూడా లభిస్తాయి.
మీకు ఎవరైనా సహాయం చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల బంధాలు బలంగా మారుతాయి.
ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, ఇతరులను వేలెత్తి చూపడం వంటివి చేయవద్దు. నిత్యం ఇతరులను విమర్శించడం వల్ల మీ విలువ తగ్గుతుంది.
అవసరమైన వారికి సాయం చేయాలి. సాయం చేయడం వల్ల మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
నిత్యం పాజిటివ్‌గా ఉండండి. నెగిటివ్‌గా మాట్లాడకూడదు. పాజిటివ్‌గా ఆలోచించే వారిని అందరూ ఇష్టపడతారు.
ఇతరులకు ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకోవాలి. అది మీ విశ్వసనీయతను ఇంకా పెంచుతుంది. దీంతో నలుగురు మిమ్మల్ని ఇష్టపడతారు.