సీనియర్ ఆర్టిస్ట్‌లో సీరియల్ అంటే సీన్ చినిగిపోవాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వాళ్ల ముందు తేలిపోతుంటారు. ఆమని, ప్రభాకర్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో స్క్రీన్ పంచుకుని..
ఈ ‘చిన్నోడు’ అద్భుత నటనతో చితక్కొట్టేస్తున్నాడు. అతని పేరే నితిన్ అద్వి. వచ్చింది కన్నడ నుంచీ.. చేస్తున్నది రెండో సీరియల్ అయినా కూడా.. ఈ చిన్నోడు తెలుగు ప్రేక్షకులు బాగా చేరువయ్యాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్‌గా మెప్పిస్తున్న నితిన్ అద్వి.. తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తోటి ఆర్టిస్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు.రామరాజుకి అదేనండీ.. మన ప్రభాకర్ కోపం ఎక్కువా? షూటింగ్లో చాలా సీరియస్‌గా ఉంటారు.. తిడతారు అనే టాక్ ఉంది. అయితే ఇదంతా ఆయనలో ఒక కోణం మాత్రమే.. ఆయన అసలు రూపం ఇదీ అంటూ ఆసక్తికర విషయాలను చెప్పాడు ధీరజ్. ఒక్క ప్రభాకర్ గురించే కాదు.. నర్మద, ప్రేమ, శ్రీవల్లి, వేదవతిల గురించి కూడా చెప్పుకొచ్చాడు ధీరజ్. తాజా ఇంటర్వ్యూలో నితిన్ అద్వి మాట్లాడుతూ.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కనిపించే ప్రతి పాత్ర ఆడియన్స్‌కి అంతలా కనెక్ట్ అయ్యిందంటే.. ఆయా పాత్రల్లో వాళ్లంతా ఒదిగిపోవడమే. ముఖ్యంగా మా అమ్మ (సీరియల్లో) ఆమని గారిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అంత పెద్ద యాక్టర్‌తో కలిసి చేయడం చాలా లక్కీ. అమ్మకి కొడుకుగా మంచి రోల్ వచ్చింది. నిజానికి నాకు ఆమని గారు అంటే ఎవరో తెలియదు. తరువాత ఆమెతో జర్నీ చేస్తూ.. చేస్తూ ఆవిడ గురించి తెలుసుకున్నాక.. వావ్ అనిపించింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌కి రెండు కళ్లు అంటే ప్రభాకర్ సార్, ఆమని మేడమ్. ఆ వెనుకే మేం ఉన్నాం. మేమంతా పిల్లలం. వాళ్లిద్దరే టార్చ్ బేరర్స్. నాకు కెమెరా అంటే సిగ్గు. కానీ వీళ్లందరితో చేస్తుంటే ఆ భయం పోయింది. నేను సోషల్ మీడియా పర్సన్‌ని కాదు.. కాస్త టైమ్ పడుతుంది. ప్రభాకర్ గారంటే అగ్రిసివ్ అని అనుకుంటారు కానీ.. ఆయన దగ్గర ఓవర్ డ్రామా ఉండదు. ఆయన లైఫ్ చాలా ప్రాక్టికల్. రాత్రి షూటింగ్ చాలా లేట్ అయ్యింది సార్.. 2 అయిపోయింది అని అంటే.. ‘హీరో హీరోయిన్స్ అంటే అలాగే ఉంటుంది.. అని అంటారంతే. డ్రామా ఉండదు. డ్రమటిక్‌గా మాట్లాడటం.. డ్రమటిక్‌గా చెప్పడం అదేం ఉండదు. వెరీ ప్రాక్టికల్ పర్సన్. హైలీ టాలెంటెడ్ పర్సన్. నేను ఇప్పటివరకూ అంత టాలెంటెడ్ పర్సన్‌ని చూడలేదు. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి. వర్క్ టైమ్‌లో వర్క్ రిలేటెడ్ ఎంత ఇన్వాల్వ్మెంట్ చూపించాలో ఆయన్ని చూసి నేర్చుకున్నా. అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంటుంది.. అది ఎవ్వరూ కనిపెట్టలేరు. కానీ ఆయనకి అది తెలుసు. డైరెక్టర్ని పిలిచి టకీమని చెప్తారు. అప్పుడు సరిచేసుకుంటారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సరదాగా ఉన్నప్పుడు ప్రభాకర్ సార్ అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. చాలా ఫన్‌గా ఉంటారు. కెమెరా ముందు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఉంటారు. వర్క్ ఫస్ట్. నిర్మాత కష్టం ఏంటో ఆయనకి తెలుసు. అందుకే స్ట్రిక్ట్‌గానే ఉంటారు. అలా ఉంటేనే నిర్మాతకి న్యాయం జరుగుతుంది. ప్రభాకర్ సర్ అంటే మైండ్‌బ్లోయింగ్ అంతే. నాకు వదినగా చేస్తున్న అన్షు (నర్మద) అంటే.. ఓ సిస్టర్, ఓ మదర్, ఓ ఫ్రెండ్ మిక్స్డ్ కేరింగ్ పర్సనాలిటీ. ఎవరు ఏ బాధలో ఉన్నా కూడా.. ఆమెకి తెలిసిపోతుంది. మనం లోగా ఉంటే దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నీకు బాగానే ఉందా? అని అడుగుతుంది. చాలా కేరింగ్ పర్సనాలిటీ. చాలా ఫన్‌గా ఉంటుంది. వేరే వాళ్ల గురించి బ్యాడ్‌గా చెప్పడం.. గాసిప్ చేయడం చూడలేదు. తన వస్తే సందడి ఉంటుంది. అందరికీ ఫుడ్ తీసుకుని వస్తుంది. పెడుతుంది.. ముందే చెప్తుంది.. నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుని వస్తానని.. నవ్వుతుంది.. నవ్విస్తుంది.. తనది స్వీట్ సోల్. ప్రేమ (లావణ్య)తో ఏడాదిన్నర జర్నీ చేశా. ఆమె మానేయడంతో ప్రేమ పాత్రలోకి మాన్విత వచ్చింది. ఆమె కొత్త కాబట్టి కాస్త టైమ్ పడుతుంది. హీరో హీరోయిన్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడితే.. ఏ సీన్‌ని అయినా ఈజీగా చేయొచ్చు. రొమాంటిక్ సీన్లలో ఎవరికి అన్ కంఫర్టబుల్‌గా అనిపించినా సీన్ పండదు. మంచి ఫ్రెండ్ షిప్ డెవలప్ అయితే ఎలాంటి సీన్లు అయినా చేయొచ్చు. ఈ సీరియల్ అనే కాదు.. ఏ సీరియల్ అయినా కూడా మంచి వైబ్ ఉంటే బావుంటుంది. మాన్విత ఇంకా నేర్చుకునే ప్రాసెస్‌లో ఉంది. ఫ్రెండ్ షిప్ అనేది స్పార్క్‌లా క్రియేట్ అవ్వాలి. జర్నీలో వస్తుంది. కాస్త టైమ్ పడుతుంది. మాన్విత కూడా కన్నడ అమ్మాయే. శ్రీవల్లి (త్రివేణి) అయితే యాక్టింగ్ ఇరగదీస్తుంది. ఆమెలో ఉన్న యాక్టివ్నెస్నే ఆమెకి చాలా హెల్ప్ అవుతుంది. ఆమె శ్రీవల్లి క్యారెక్టర్ని ఎంతలా ఓన్ చేసుకుంది అంటే.. వల్లీలాగే బిహేవ్ చేస్తుంది. క్యారెక్టర్లోనే ఉంటుంది. మేం గుర్తు చేస్తుంటాం.. నువ్వు వల్లీ కాదు.. త్రివేణి అని. ఆమె ఖచ్చితంగా పెద్ద నటి అవుతుంది. అంతలా కష్టపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నితిన్ అద్వి అలియాస్ ధీరజ్.