
– ఓటరు వివరాల నవీకరణకు ప్రత్యేక కార్యాచరణ – ప్రజలు బీఎల్వోలను సంప్రదించాలని తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి సూచన బీబీనగర్, జూన్ 23 : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని...
– ఓటరు వివరాల నవీకరణకు ప్రత్యేక కార్యాచరణ – ప్రజలు బీఎల్వోలను సంప్రదించాలని తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి సూచన
బీబీనగర్, జూన్ 23 : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎల్వోల పనితీరును పర్యవేక్షించేందుకు నలుగురు బీఎల్వో సూపర్వైజర్లను నియమించినట్లు పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు జూన్ 25 నుండి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణలు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల వివరాల ధృవీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మండలంలోని గూడూరు, జైనపల్లి, కొండమడుగు, జియ్యాపల్లి, మహాదేవ్‌పూర్, రాయరావుపేట, నేమారుగొమ్ముల, వెంకిర్యాల, రుద్రవెల్లి, రాఘవాపురం, బ్రాహ్మణపల్లి, భట్టుగూడెం, బీబీనగర్‌తో పాటు వివిధ గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు సంబంధించిన బీఎల్వోలను సంప్రదించి ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గూడూరు : ఎం. శ్యామల (9291238297), రాధిక (8374263015) జైనపల్లి : స్వరూప (9848249331), కె. విశాల (9290153294) కొండమడుగు : ఎ. శోభారాణి (9912382814), ఎం. అనిత (6302909162), ఎం. బాలకృష్ణ (9133321649), మహేందర్ (9618481652) జియ్యాపల్లి : ఎం. శారద (9951266101) మహాదేవ్‌పూర్ : పి. సంతోషి (6305709166) రాయరావుపేట : సీహెచ్. లక్ష్మి (9951210290) జమీలపేట : జె. లావణ్య (9652422873) నేమారుగొమ్ముల : డి. సునీత (7671830829), వంగూరి బాల సరస్వతి (9291369739) బడ్యగర : ఎం. సుజాత (7674049291) పదమటిసోమారం : కె. సంగీత (8106621976) వెంకిర్యాల : సీహెచ్. అరుణ (9666812562), బి. బాలమణి (7330933672), జి. భాగ్య (7893768645), ఎన్. పద్మ (9550629476) మక్తా అనంతారం : దర్నబోయిన కనకదుర్గ (8978348483) రుద్రవెల్లి : కె. నాగమణి (9959125514) రాఘవాపురం : ఎం. షహేదా (9704641507), అరుట్ల సునీలత (9848542791) బ్రాహ్మణపల్లి : పి. సుశీల (9989526736), బి. రేణుక (9346685973) లక్ష్మీదేవిగూడెం : జి. శోభారాణి (9177941887) రేచెర్లనగూడ : ఎం. బాలమణి (9948587858) చిన్నరవులపల్లి : పి. ధనలక్ష్మి (9618087186) భట్టుగూడెం : మహాలక్ష్మి (9398360175), కృష్ణవేణి (9848094609) గుర్రాలదండి : బి. అమృత (7095587281) పెద్దపలుగు తండా : జి. అందాలు (7658948698) జంపల్లి : కె. వసంత (9912095496) రావిపహాడ్ : ఎం. కల్పన (9505064023) మాధారం : వి. ధనలక్ష్మి (9440819998) మగ్దుంపల్లి : పి. భాగ్యశ్రీ (6300483670) గొల్లగూడెం : కె. యశోద (6301428402) అన్నంపట్ల : టి. ధనమ్మ (8297353705) బీబీనగర్ : పి. హేమలత (9247473058), ఎ. హైమావతి (8374119672), ఎం. రజిత (7032859061), పి. విజయలక్ష్మి (9440638157), ఎ. సరస్వతి (7794027639), భాగ్యలక్ష్మి (6281864113) రంగాపురం : అనిత (8499883463)
మహ్మద్ మహమూద్ (8885522139) – పోలింగ్ స్టేషన్లు 100 నుంచి 109 వరకు కె.బాలమణి (7337569151) – పోలింగ్ స్టేషన్లు 110 నుంచి 119 వరకు ఎస్.ఆదిత్య రాజ్ (9346186059) – పోలింగ్ స్టేషన్లు 120 నుంచి 132 వరకు ఎ.బబిత (9966375342) – పోలింగ్ స్టేషన్లు 133 నుంచి 145 వరకు.
ఓటర్లు తమకు సంబంధించిన బీఎల్వోలను సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారమ్‌లు నింపడంతో పాటు ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి సూచించారు.