
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Jio Platforms IPO: స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ తో కూడుకున్నదని భావిస్తుంటాం. కానీ ఏ స్టాక్ అద్భుతాలు చేసి దాని ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తుందో చెప్పడం కష్టం. అసలు అంచనా వేయలేము. అలాంటి స్టాక్స్ లో ఒకటి ముకేశ్ అంబానీ కంపెనీ అయిన జియో ఫ్లాట్ ఫామ్స్. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకముందే ఇన్వెస్టర్లపై కనక వర్షం కురిపిస్తోంది. దీనికి ఉదాహరణ మహేంద్రా నవతా అని చెప్పాలి. 16ఏళ్ల క్రితం రిలయన్స్ ను టెలికాం రంగంలోకి ప్రవేశపెట్టడంలో సహాయపడిన ఆయన ఇప్పుడు భారీ లాభాలను అర్జించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలా అంటే ఆయన కంపెనీలో ఒక్కో షేరును కేవలం రూ. 10ధరకే కొనుగోలు చేస్తే దాని విలువ ఇప్పుడు 100 రెట్లకు పైగా పెరిగింది. టెలికాం రంగంలో సీనియర్ వ్యాపారవేత్త, హెచ్ డీఎఫ్సీ ప్రమోటర్ అయిన మహేంద్ర నహతా, జియో ఐపీఓ ద్వారా 100 రెట్ల లాభం అర్జించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేంద్రా నహతాకు జియో ఫ్లాట్ ఫామ్స్ లో 0.54 శాతం వాటా ఉండేది. దీన్ని ఆయన 2020లో కొనుగోలు చేశారు. దీనికోసం అప్పట్లో 48కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం.. జియో ఫ్లాట్ ఫామ్స్ ప్రస్తుత విలువ సుమారు 114 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం మహేంద్రా నహతా వాటా విలువ దాదాపు రూ. 5,800కోట్లు. అంటే ఆయన పెట్టిన పెట్టుబడి 100 రెట్లు పెరిగినట్లు చెప్పవచ్చు.
మహేంద్ర నహతా ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మహేంద్ర నాహతా సహాయపడ్డారు. 2010లో మహేంద్ర నాహతా కంపెనీ అయిన ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్, భారతదేశం అంతటా రూ. 12,872 కోట్లకు 4G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినప్పుడు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్, ప్రస్తుతం రిలయన్స్ జియోగా పిలుస్తున్న ఆ కంపెనీలో రూ. 4,800 కోట్లకు 95శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుండి నాహతా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతున్నారు.
48 కోట్లు 5800 కోట్లు ఎలా అయ్యాయి? 2020లో నహతా కుటుంబం కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్లను ఈక్విటీగా మార్చుకుని.. కేవలం రూ. 48 కోట్లకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.54శాతం వాటాను, అంటే సుమారు 47.8 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్ రాబోయే ఐపీఓ విలువ 114 బిలియన్ డాలర్లు ఉండవచ్చని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో తెలిపింది. ఈ వాల్యుయేషన్ ప్రకారం, కంపెనీలో మహేంద్ర నహ్తా పెట్టుబడి విలువ రూ. 5,800 కోట్లు కాగా, దీనిపై 121 రెట్ల రాబడి లభిస్తుంది.
తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంత బలమైన రాబడులను అందిస్తాయనడానికి జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందని చెప్పాలి. నహతా కుటుంబం 2020లో కేవలం రూ. 10కే జియో షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు కంపెనీలో 0.54శాతం వాటాను కలిగి ఉంది. ఈ పెట్టుబడి టెలికాం రంగంలో రిలయన్స్ ప్రారంభ రోజుల నాటిది. జూలై 2020లో జియో ప్లాట్‌ఫామ్స్ ప్రపంచ పెట్టుబడిదారుల నుండి నిధులను సమీకరించినప్పుడు నహతా కుటుంబానికి సుమారుగా రూ. 37 కోట్ల విలువైన కన్వర్టిబుల్ డిబెంచర్లను కేటాయించారు. ఆ తర్వాత రిలయన్స్, నహ్తా కుటుంబానికి అదనపు షేర్లను కేటాయించడంతో, వారి వాటా 0.536శాతానికి పెరిగింది.
ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓపై తాజా సమాచారాన్ని అందించారు. కంపెనీ విలువ పెట్టుబడిదారులకు గణనీయమైన లాభాలను సూచిస్తోంది. అంబానీ ఇటీవల రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐపీఓకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.