
తమిళనాడులో లంచగొండితనం, రోజువారీ అవినీతిపై (tamil nadu corruption) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త డిజిటల్ పోరాటం ప్రారంభించారు. దీపక్ అనే ముప్పై ఏళ్ల యువకుడు రూపొంది
తమిళనాడులో లంచగొండితనం, రోజువారీ అవినీతిపై (tamil nadu corruption) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సరికొత్త డిజిటల్ పోరాటం ప్రారంభించారు. దీపక్ అనే ముప్పై ఏళ్ల యువకుడు రూపొందించిన ఒక సాధారణ వెబ్‌సైట్ ఇప్పుడు ప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేస్తోంది. సామాన్యుల నుంచి వసూలు చేసే లంచాల వివరాలను సేకరించేందుకు ఆయన ప్రారంభించిన ఈ ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నీట్ రద్దు, మీ హిందీ వద్దు- అసెంబ్లీలో కేంద్రానికి తేల్చేసిన విజయ్..!తమిళనాట అవినీతి (Corruption)తమిళనాడు ప్రభుత్వ మద్యం దుకాణాలైన టాస్మాక్ (TASMAC) లో ప్రతి బాటిల్‌పై అదనంగా పది రూపాయలు వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి దీపక్ ఒక సాధారణ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమకు ఎదురైన అనుభవాలను ఇందులో పంచుకోవడం ప్రారంభించారు. కేవలం కొద్ది రోజుల్లోనే దాదాపు పది వేల మంది ఈ సైట్‌ను సందర్శించి, వందలాది ఫిర్యాదులు నమోదు చేయడంతో ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి సారించారు.మద్యం దుకాణాలు, ఆఫీసులు, మున్సిపాలిటీల్లోమద్యం దుకాణాలకే పరిమితం కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, విద్యుత్ కనెక్షన్లు, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న లంచాల గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీనిని గమనించిన దీపక్.. మే 27న మక్కల్ సాక్షి (ప్రజా సాక్షి) పేరుతో సమగ్రమైన పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 75 ప్రభుత్వ సేవల విభాగాల్లో జరిగే అవినీతిపై ప్రజలు అజ్ఞాతంగా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు.మక్కల్ సాక్షితో బట్టబయలుఈ వేదిక ద్వారా అందిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఉన్నతాధికారులు వేగంగా స్పందిస్తున్నారు. చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్‌లో యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో రచ్చ కావడంతో, ఉన్నతాధికారులు సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అలాగే క్యాన్సర్ రోగి నుంచి లంచం అడిగిన హృదయ విదారక ఘటనలు కూడా ఈ వేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి. Tamil Nadu: తమిళ ఎన్నికల్లో విదేశీయుల ఓట్లు ? రంగంలోకి ఈసీ, ఐబీ-ఎస్ఐఆర్ పైనా..!వ్యపస్ధలో లోపాలు బయటపెడుతున్న దీపక్ రాజకీయ పక్షాలు లేదా ఎన్‌జీవోలతో సంబంధం లేకుండా, ఎటువంటి నిధులు ఆశించకుండా దీపక్ ఒంటరిగా ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా అధికారుల పేర్లను నేరుగా ప్రచురించకుండా, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడమే ఈ సైట్ ముఖ్య ఉద్దేశం. సాంకేతికతను సరైన మార్గంలో ఉపయోగిస్తే సామాన్యులకు ఏ విధంగా అండగా నిలవవచ్చో చెప్పడానికి ఈ వినూత్న డిజిటల్ ప్రయోగమే ఒక చక్కని ఉదాహరణ. ఇది ఇప్పుడు అవినీతిపై సీఎం విజయ్ పూరించిన శంఖానికి దన్నుగా నిలుస్తోంది. ఈ వెబ్ సైట్ ద్వారా గుర్తించిన అవినీతిపై అధికారులు యుద్దం చేసేందుకు విజయ్ వారికి పూర్తి స్వేచ్ఛ నిస్తున్నారు.