
రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురిసిన వేళ జనావాసాల్లో పాములు అధికంగా తిరుగుతాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్...
రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురిసిన వేళ జనావాసాల్లో పాములు అధికంగా తిరుగుతాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ అన్నారు. గత రెండు రోజుల్లోనే 7హిల్స్ ఏరియా, ప్యూన్ బస్తీ, రామవరం, బాబుక్యాంప్, బర్మా క్యాంప్, పాల్వంచ ప్రాంతాల్లో ఆరు విష సర్పాలు, మూఉ విష రహిత సర్పాలను బంధించి అడవిలో వదిలినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి వర్షాకాలంలో సర్పాలు ఆహారం, సంతానం కోసం ఎక్కువగా బయటికి వస్తాయని, కావునా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాములకు మరుగు లేకుండా పనికిరాని వస్తువులు తొలగించాలని, రాత్రులు వెలుగు ఉండేలా చూసుకోవాలన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కాళ్లకు గమ్ షూస్ ధరించడం, రాత్రుళ్లు టార్చ్ లైట్ తో వెళ్లడం మంచిదని సూచించారు. అవకాశం ఉంటే పామును ఫొటో తీయడం లేదా పాముపై మచ్చలు చెప్పడం వల్ల వెంటనే అప్రమత్తం చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు.