
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకాయానం తిరిగి ఊపిరి పీల్చుకుంటోంది. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు.
నిన్న ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని, ఇది ఆల్‌టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. చమురు ధరలు పడిపోతున్నాయని.. ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందంటూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. ఇక ఇరాన్‌తో ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఆ దేశం అంగీకరించిందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.