
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆరంభం అదిరిపోయింది. పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బంతితో చెలరేగి ప్రత్యర్థి జట్టును 141 పరుగులకే కట్టడి చేసిన ఈ ఛాంపియన్స్.. లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి (35; 13 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఆరంభం ఇవ్వగా.. అన్విత్ రెడ్డి (53*; 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గడుగు గణేశ్ (50*; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అన్విత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
పాలమూరు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. గత రెండు ఓవర్లలో హైదరాబాద్ బ్యాటర్లు 19 పరుగులు రాబట్టారు. రవి కిరణ్ వేసిన 13 ఓవర్లో గణేశ్ బ్యాట్ నుంచి రెండు ఫోర్లు వచ్చాయి. 13 ఓవర్లకు ‘ఈ’ ఛాంపియన్స్ స్కోరు 114/3. గణేశ్ (32), అన్విత్ (42) పరుగులతో ఉన్నారు.
పాలమూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. నిశాంత్ రెడ్డి వేసిన 11 ఓవర్లో అన్విత్ రెండు ఫోర్లు, గణేశ్ ఒక ఫోర్, సిక్స్ బాదేశారు.ఈ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 95/3. గణేశ్ (18), అన్విత్ రెడ్డి (37) పరుగులతో ఉన్నారు. హైదరాబాద్ లక్ష్యం 142.
పాలమూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గత నాలుగు ఓవర్లలో 18 పరుగులు వచ్చాయి. గణేశ్ (6), అన్విత్ రెడ్డి (28) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ టార్గెట్ 142.
142 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. యశ్వీర్ గౌడ్ (3) ఔటయ్యాడు. రవి కిరణ్ బౌలింగ్‌లో (5.4 ఓవర్) వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతకముందు నిపుణ్ రెడ్డి వేసిన ఐదో ఓవర్లో అన్విత్ రెడ్డి వరుసగా 6, 4 బాదాడు. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 55/3. గణేశ్ (0), అన్విత్ రెడ్డి (16) క్రీజులో ఉన్నారు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లక్ష్యఛేదనకు దిగింది. రవి కిరణ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రిషభ్ బస్లాస్ వేసిన రెండో ఓవర్లో సాయి వికాస్ రెడ్డి (1).. బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. పార్ధిపన్ వేసిన మూడో ఓవర్లో హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 24 పరుగులు రాబట్టాడు. తర్వాత రిషభ్ బస్లాస్ బౌలింగ్‌లో అభిరథ్ (35; 13 బంతుల్లో).. రోహిత్ రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 38/2. యశ్వీర్ (1), అన్విత్ (1) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.