
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Giant python swallowed Small goat video viral: కొండ చిలువలు చాలా ప్రమాదకరమైనవి చెప్తారు. ఇటీవల సోషల్ మీడియాలో పాములు, కొండ చిలువల వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ గా మారాయి. అవి జనావాసాల్లోకి వేటలో భాగంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో కొండ చిలువలు 8 నుంచి 12 అడుగుల పొడవు పెద్దవిగా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కొండ చిలువలు తమ ముందు ఉన్న జంతువులను లేదా మనుషుల్ని ఇట్టే దాడి చేసి చుట్టుకుంటాయి. అవి శరీరంను చుట్టుకుని అమాంతం వేటను మింగుతాయి. తొలుత దాడి చేసి వేట శరీరంను చుట్టుకుని ఎముకలు అన్ని విరిగిపోయేలా చేస్తాయి.ఆ తర్వాత ఊపిరాడకుండా ఆ జీవి చనిపోయిన తర్వాత దాని మీద దాడి చేసి మింగుతాయి.
ఒకసారి కొండ చిలువ వేటను తిన్నాక కొన్ని రోజులుపాటు ఇతర జీవుల్ని వేటాడదంటారు. అసలు అది వేటను తిన్నాక దాని కడుపంతా ఉబ్బి కనీసం కదల్లేక అవస్తలు పడుతుందంటారు.అచ్చం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక భారీ కొండ చిలువ బైటపడింది. అది చాలా పొడవుగాను, బలంగాను ఉంది. అడవికి దగ్గరలో ఉన్న ప్రాంతంలోకి దూరి వచ్చిన భారీ కొండ చిలువ అక్కడున్న మేక పిల్లను అమాంతం మింగేసింది.
ఆ తర్వాత ఎటుకదల్లేక తచ్చాడుతు ఉండిపోయింది. ఇంతలో అక్కడున్న వారు కొండ చిలువను గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత కొండ చిలువను దగ్గర నుంచి చూస్తుంటే అది పలు మార్లు వారిపై దాడికి సైతం పాల్పడింది. కానీ అది ముందుకు , వెనక్కు కదల్లేక తీవ్ర అవస్థలు పడుతుంది.
Read more: Snake Video: అదేమన్నా నీ బాయ్ ఫ్రెండా..?.. కోబ్రాను ముద్దులతో ముంచెత్తుతున్న యువతి.. వీడియో వైరల్..
అక్కడున్న మేక వెంట్రుకలను బట్టి అది మేక పిల్లను మింగిందని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వానాకాలంలో కొండ చిలువతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.