శరీరంలో కొవ్వు పెరగడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గుండెపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ కొన్ని పండ్లు తినడం ద్వారా మీ పొట్ట తగ్గించుకోవడంతో పాటు గుండెను హెల్తీగా ఉంచుకోవచ్చు.
ఆ పండ్లు ఏంటో ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చిరాగ్ డి (ఏస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్, బెంగళూరు) తెలిపారు. అవేంటో చూద్దాం.
యాపిల్ పండ్లలో సాల్యూబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పొట్ట పెరగకుండా ఉంటుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి పండ్లను తింటే ఫైబర్ బాగా అందుతుంది. తద్వారా పొట్ట కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే బెర్రీస్ తింటే ఆరోగ్యం బాగుంటుంది.
నారింజ పండ్లలో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే గుండె పనితీరు బాగుంటుంది. బరువు కూడా తగ్గవచ్చు.
అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
అంజీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను రోజూ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే గుండె పనితీరు బాగుంటుంది
ద్రాక్ష పండ్లలో ఫైబర్, పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. పొట్ట కూడా తగ్గుతుంది.
అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లను తింటే ఆకలి తగ్గుతుంది. ఎనర్జీ బాగా అందుతుంది.