
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Jun 23 2026 4:23 PM | Updated on Jun 23 2026 4:32 PM
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్ గురయ్యారు.
ఏం జరిగింది పుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.
పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
పోలీసులు ఈ చిన్న లాజిక్‌ను మిస్సయ్యారు సాయి కృష్ణ కేసులో దృశ్యం సీన్ రిపీట్..!
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...