
– ఐటీసీ యాజమాన్యానికి కనీస వేతన మండలి సభ్యుడు యారం పిచ్చిరెడ్డి వినతి బూర్గంపహాడ్, జూన్ 23 : నూతన వేతన జీవోను తక్షణమే ఐటీసీ కర్మాగారంలో అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ...
– ఐటీసీ యాజమాన్యానికి కనీస వేతన మండలి సభ్యుడు యారం పిచ్చిరెడ్డి వినతి
బూర్గంపహాడ్, జూన్ 23 : నూతన వేతన జీవోను తక్షణమే ఐటీసీ కర్మాగారంలో అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మంగళవారం ఐటీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన వేతనాల ప్రకారం కార్మికులకు అందాల్సిన వేతనాలు ఐటీసీ కర్మాగారంలో ఈ జీవో ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం కోడ్ ఆన్ వేజేస్ 2019, షెడ్యూల్-1, ఎంప్లాయిమెంట్లో పేర్కొన్న నూతన కనీస వేతన రేట్లు 1.06.2026 నుండి అమలులోకి వచ్చాయని, పాత వేతన నోటిఫికేషన్లు రద్దుకావడంతో ప్రభుత్వం కల్పించిన కొత్త వేతన సౌకర్యాన్ని ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్లో బదిలీ, కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే వర్తింపచేయాలని, అంతేకాకుండా కార్మికుల శ్రమకు తగిన న్యాయమైన వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఐటీసీ విభాగం అధ్యక్షుడు గోనె రామారావు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.