
హైదరాబాద్ - తాజా సమాచారం: 142 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. యశ్వీర్ గౌడ్ (3) ఔటయ్యాడు. రవి కిరణ్ బౌలింగ్‌లో (5.4 ఓవర్) వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతకముందు నిపుణ్ రెడ్డి వేసిన ఐదో ఓవర్లో అన్విత్ రెడ్డి వరుసగా 6, 4 బాదాడు. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 55/3. గణేశ్ (0), అన్విత్ రెడ్డి (16) క్రీజులో ఉన్నారు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లక్ష్యఛేదనకు దిగింది. రవి కిరణ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రిషభ్ బస్లాస్ వేసిన రెండో ఓవర్లో సాయి వికాస్ రెడ్డి (1).. బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. పార్ధిపన్ వేసిన మూడో ఓవర్లో హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 24 పరుగులు రాబట్టాడు. తర్వాత రిషభ్ బస్లాస్ బౌలింగ్‌లో అభిరథ్ (35; 13 బంతుల్లో).. రోహిత్ రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 38/2. యశ్వీర్ (1), అన్విత్ (1) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.