
భారతీయ నగరాల్లో ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది... హైదరాబాద్ ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో పెద్ద కార్లలో ప్రయాణం చాలా కష్టం.
ఇక బాగా డెవలప్ అయిన హైటెక్ సిటీ, మాధాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయాయి.. ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, పార్కింగ్ ఇబ్బందులు తప్పడంలేదు. ఇది ఏ ఒక్కరోజో, రెండ్రోజుల సమస్యో కాదు… నిత్యం వేదించేది. అందుకే ఇలాంటి కష్టాలను తట్టుకోవాలంటే పెద్దపెద్ద లగ్జరీ కార్లు కాదు చిన్న కార్లే బెస్ట్ ఆప్షన్. సిటీ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయే 5 చిన్న కార్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి… వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రస్తుతం ఇండియాలో అమ్ముడవుతున్న కార్లలో MG Comet EV (ఎంజి కామెట్ ఈవి) అత్యంత చిన్నది. దీని పొడవు కేవలం 2,974 మిమీ మాత్రమే… అంటే 3 మీటర్ల కంటే తక్కువ. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా సిటీ ట్రాఫిక్ కోసమే డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా ఇరుకైన ప్రదేశాల్లో కూడా దీన్ని నడపవచ్చు, సులభంగా పార్క్ చేయవచ్చు.
ఎలక్ట్రిక్ రేంజ్ : సుమారు 230 కిలోమీటర్లు
సిటీస్ లో రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకు బయటకు వెళ్లేవారికి ఎంజీ కామెట్ ఈవి ఒక మంచి ఎంపిక.
మారుతి సుజుకి ఆల్టో K10 ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న కారు. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీని బలాలు.
మొదటిసారి కారు కొనేవారికి మారుతి సుజుకి ఆల్టో సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ఆల్టో K10 ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో చిన్న కారే అయినా SUV లాంటి ఎత్తైన సీటింగ్ పొజిషన్ కలిగివుంది.. అందుకే ఇందులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత.
ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది… కాబట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాడాలనుకునే కస్టమర్లకు ఎస్-ప్రెస్సో పర్ఫెక్ట్ ఛాయిస్.
ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలెరియో ముందు వరుసలో ఉంది.
AMT ఆటోమేటిక్ సౌకర్యం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏళ్లుగా భారతీయ కుటుంబాల నమ్మకాన్ని చూరగొన్న కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఇది చిన్న సైజులో ఉన్నప్పటికీ, లోపల ఎక్కువ స్పేస్‌ను అందిస్తుంది. అందుకే ఓ ఫ్యాామిలీ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
కుటుంబానికి సరిపోయే క్యాబిన్ స్పేస్ 'టాల్-బాయ్' డిజైన్, లోపల ఎక్కువ హెడ్‌రూమ్ ఉండటం ఈ వ్యాగనార్ ప్రధాన బలం.
సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి, పార్కింగ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి 2026లో ఈ 5 కార్లు ఉత్తమ ఎంపికలు.