
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ ప్రశంసలతో పాటు ఆయన చేసిన ఒక కీలక వ్యాఖ్య, సమంత ప్రెగ్నెన్సీపై జరుగుతున్న ప్రచారానికి మరింత...
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ ప్రశంసలతో పాటు ఆయన చేసిన ఒక కీలక వ్యాఖ్య, సమంత ప్రెగ్నెన్సీపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.'మా ఇంటి బంగారం' సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి 'ఎక్స్' వేదికగా తెలిపారు. "ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తూ దర్శకురాలు నందిని రెడ్డి చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి" అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.అయితే, తన ట్వీట్ ముగింపులో "జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత-రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు" అని చిరంజీవి పేర్కొనడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఈ 'కొత్త అధ్యాయం' అనే పదం సమంత గర్భం దాల్చడాన్ని ఉద్దేశించిందేనని, ఆమె ప్రెగ్నెన్సీ వార్తను మెగాస్టార్ పరోక్షంగా ధ్రువీకరించారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఇక, మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఎంతో భావోద్వేగంతో స్పందించారు. "మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి లెజెండరీ వ్యక్తి నుంచి అభినందనలు అందుకోవడం ఒక కలలా ఉంది. మా సినిమా మీకు నచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను మేకర్స్ కంటే ముందే అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సమంత వ్యక్తిగత విషయాన్ని కూడా అనుకోకుండా లీక్ చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా