
అతిగా ఆలోచించడం చాలా మందిని వేధించే సమస్య. చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా ఊహించుకోవడం, గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం మనశ్శాంతిని...
అతిగా ఆలోచించడం చాలా మందిని వేధించే సమస్య. చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా ఊహించుకోవడం, గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. దీని నుంచి బయటపడడానికి సైకాలజీ నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు చూద్దాం..అతిగా ఆలోచిస్తున్నారని గుర్తించండిఏదైనా సమస్యకు పరిష్కారం వెతుకుతున్నారా? లేక అదే ఆలోచన చుట్టూ తిరుగుతున్నారా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పరిష్కారం కనిపించకపోతే, అది ఓవర్‌థింకింగ్ అని గుర్తించండి.నియంత్రణలో ఉన్నవి, లేనివి వేరు చేయండిఒక కాగితంపై రెండు జాబితాలు తయారు చేయండి. మీ చేతిలో ఉన్న విషయాలు ఒకవైపు, మీ నియంత్రణలో లేనివి మరోవైపు రాయండి. మొదటి జాబితాపైనే దృష్టి పెట్టండి.ఆందోళనకు ఒక సమయం కేటాయించండిరోజులో 10-15 నిమిషాలు మాత్రమే ‘ఆందోళన సమయం’గా నిర్ణయించుకోండి. మిగతా సమయంలో వచ్చిన ఆందోళనలను ఆ సమయానికి వాయిదా వేయండి.మీ ఆలోచనలను ప్రశ్నించండిమనసు చెప్పే ప్రతి భయాన్ని నిజమని నమ్మకండి. “దీనికి ఆధారం ఏంటి?” అని ప్రశ్నించండి. చాలా భయాలు వాస్తవాలపై కాకుండా ఊహలపై ఆధారపడి ఉంటాయి.పరిపూర్ణత కోసం ఎదురు చూడకండి100 శాతం సిద్ధమైన తర్వాతే పని మొదలుపెడతానని అనుకోవద్దు. చిన్న అడుగైనా ముందుకు వేయండి. చర్య తీసుకోవడం ఆందోళనను తగ్గిస్తుంది.సమాచార సేకరణకు హద్దు పెట్టండిప్రతి నిర్ణయం కోసం అంతులేని సమాచారం వెతకడం మానండి. ఒక గడువు పెట్టుకొని, అందుబాటులో ఉన్న సమాచారంతోనే నిర్ణయం తీసుకోండి.చర్యలతో ఆలోచనలను తగ్గించండివ్యాయామం, వంట, పజిల్స్, సంగీతం వంటి పనుల్లో పాల్గొనండి. ఇవి మనసును వేరే దిశకు మళ్లిస్తాయి.ప్రస్తుతంలో