తమిళనాడు సీఎం విజయ్, హీరోయిన్ త్రిష మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.
వాటికి మరింత బలాన్ని చేకూర్చేలా, ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి ఒక వెడ్డింగ్ రెసెప్షన్ కి వెళ్లారు. తన భర్తకు మరో నటితో సంబంధం ఉందంటూ విజయ్ సతీమణి కోర్టు మెట్లెక్కారు. దీంతో వీరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు విజయ్ - త్రిష విడిపోయారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దళపతి విజయ్ సోమవారం (జూన్ 22) తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కానీ త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు. ప్రతీ ఏడాది విజయ్ పుట్టినరోజుకు ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతుంటారు. అందులోనూ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో, త్రిష విషెస్ కోసం అందరూ ఎదురుచూశారు. కానీ త్రిష మాత్రం ఈసారి ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. కొన్నేళ్లుగా విజయ్ బర్త్ డేకి ఆయనతో కలిసి దిగిన అరుదైన ఫొటోలను త్రిష షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి ఆమె మౌనంగా ఉన్నారు. దీంతో వీరి రిలేషన్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష అన్‌ఫాలో చేసిందనే సంగతి బయటకు వచ్చింది. త్రిష ఫాలోవర్స్ లిస్టులో ఇప్పుడు విజయ్ పేరు కనిపించడం లేదు. దీంతో విజయ్ - త్రిష మధ్య దూరం పెరిగిందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలోనే విజయ్ ను ఆమె అన్‌ఫాలో చేసినట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ కి త్రిష సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పనంత మాత్రాన వాళ్లిద్దరూ విడిపోయారని అనుకోవడం సరికాదని, నేరుగా ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా విజయ్, ఆయన భార్య సంగీత మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. విజయ్ కి త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం, ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.