ఇంటిలోకి తాజా గాలి ప్రసరించేలా చూడండి. ఉదయం, సాయంత్రం పూట కిటికీలు తెరవండి. దీంతో ఇంట్లో గాలి తాజాగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇంట్లో లావెండర్, మల్లె, తులసి వంటి మొక్కలను పెంచండి.
ఇవి ఇంటిని సువాసనభరితంగా మార్చుతాయి.
ఇంట్లో గాలిని స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ఎయిర్ ఫ్యూరిఫైయర్లు ఉపయోగించండి. ఇవి ఇంటిని తాజాగా ఉంచుతాయి.
ఇంటిని వ్యాక్యూమ్ క్లీన్ చేయడానికి ముందు దుప్పట్లు, కార్పెట్ల మీద బేకింగ్ సోడా చల్లండి. 15 నిమిషాల తర్వాత వ్యాక్యూమ్ క్లీన్ చేస్తే దుర్వాసన తొలగుతుంది.
స్ప్రే బాటిల్లో నీరు, కొన్ని చుక్కల లావెండర్ లేదా నిమ్మ నూనె వేసి స్ప్రే చేయండి. ఇది ఇంటి నుంచి దుర్వాసన తొలగిస్తుంది.
వంటగదిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. వంట పూర్తి అయిన వెంటనే గ్యాస్స్టౌవ్ను క్లీన్ చేయండి. దీంతో దుర్వాసన తగ్గుతుంది.
లివింగ్ రూమ్ లేదా బెడ్రూమ్లో సువాసన వచ్చే కొవ్వొత్తులు వెలిగించండి. ఇవి ఇంటిని సువాసనభరితంగా, ఆహ్లాదకరంగా మార్చుతాయి.
ఇంట్లో చెత్తని ఎప్పటికప్పుడు బయట వేయండి. డస్ట్‌బిన్ నిండే వరకు వేచి ఉండవద్దు. చెత్తను తొలగించడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.
ఒక గిన్నెలో నీరు వేసి అందులో నిమ్మ, నారింజ తొక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మరిగించండి. దీంతో ఇల్లంతా తాజాగా సువాసనభరితంగా మారుతుంది.