
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ దాదాపు 17 మందిని గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు గద్వాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడితో చిన్నారులు, వృద్ధులు ఇళ్లనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధికుక్కల బెడదను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వార్త చదివారా: కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం రేవంత్, కిషన్‌రెడ్డి భేటీ.. మెట్రో రెండోదశపై చర్చ