
Realme TechLife 43 Inch QLED TV: మీరు ఎప్పుడైనా realme స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.
ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
Realme TechLife 43 Inch QLED TV Price Cut: రియల్ మీ కంపెనీ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తూ వస్తుంది. స్మార్ట్ఫోన్స్తో పాటు అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ టీవీలను కూడా విక్రయిస్తుంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్లతో టీవీలు విడుదలవుతూ వస్తున్నాయి. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఇదే బ్రాండ్‌కి సంబంధించిన మంచి టీవీ తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
realme TechLife 109 cm (43 inch) QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి ప్రీమియం సోనీ బ్రావియా లాంటి డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన డిస్ప్లే టెక్నాలజీతో అందుబాటులోకి రావడం విశేషం.
ప్రస్తుతం ఈ టీవీ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తూ ఉన్నాయి. అలాగే ఇది ఎన్నో రకాల ఫీచర్స్ ను కలిగి ఉంది.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..43 ఇంచులు (109 cm), QLED ప్యానెల్ రెజల్యూషన్ Ultra HD (4K) డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా MEMC టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఈటీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన స్మార్ట్ ఇంటర్ఫేస్ను కలిగి ఉండడమే కాకుండా.. ఎవరికైనా సులభంగా అర్థమయిపోతుంది. అలాగే ఇది 2gb ర్యామ్‌తో పాటు అద్భుతమైన 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక దీని ఆడియో విషయానికొస్తే..40 W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్ Dolby Atmos / Dolby Audio సపోర్ట్‌తో వస్తుంది.
realme TechLife 109 cm స్మార్ట్ టీవీకి సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ దీనిని MRP ధర రూ.49,799 లకు విక్రయిస్తోంది. అయితే, దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 54 శాతం స్పెషల్ తగ్గింపుతో కేవలం రూ. 22,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..
ఇక దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఫ్లిప్కార్ట్అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే.. రూ.1,800 వరకు తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1000 తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే రూ.2 వేల వరకు బోనస్ లభిస్తుంది.