Shocking Twist in Pune Trekker Murder Case : మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగఢ్ కోట వద్ద జరిగిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
కాబోయే భార్యను ఫొటోలు తీస్తూ.. గాలివానకు ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన.. పక్కా ప్రణాళికతో జరిగిన దారుణ హత్యగా పోలీసులు తేల్చారు. తనను ఫొటో తీస్తున్న కాబోయే భర్తను.. ప్రియుడు లేదా మరో మిత్రుడితో కలిసి ఆ యువతే 400 అడుగుల లోతు లోయలోకి తోసి చంపేసిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. లూనావాలా రూరల్ పోలీసులు ఈ ప్రమాద ఘోరాన్ని హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.బర్త్‌డే వేడుకల కోసం వెళ్తే.. ప్రాణాలు తీశారు!పూణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలో డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అతడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. రాబోయే నవంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ ఖరీదైన ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగాల్సి ఉంది. అందుకోసం ప్యాలెస్‌ను కూడా ముందే బుక్ చేశారు. ఈ క్రమంలో జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో.. ఆ వేడుకలను జరుపుకోవడానికి కేతన్ తన కాబోయే భార్య, మరికొంత మంది మిత్రులతో కలిసి జూన్ 18వ తేదీన లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ వెళ్లారు. అక్కడే ఈ విషాదం చోటుచేసుకుంది.గుట్టురట్టు చేసిన పోలీసులు!ప్రమాదం జరిగిన రోజు కేతన్ కాబోయే భార్య పోలీసులకు సమాచారం ఇస్తూ.. "మేము కోటపై ఉన్నప్పుడు కేతన్ నన్ను ఫొటోలు తీస్తున్నాడు. అయితే ఒక్కసారిగా హోరుగాలి బలంగా వీయడంతో పట్టుతప్పి లోయలో పడిపోయాడు" అని నమ్మబలికింది. దీంతో పోలీసులు మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించారు. అయితే విచారణ ముదురుతున్న కొద్దీ సదరు యువతి ప్రవర్తన, ఆమె చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు గట్టి అనుమానం వచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. కేతన్ కాబోయే భార్య, ఆమెకు అత్యంత సన్నిహితుడైన ఒక మగ మిత్రుడు కలిసి పథకం ప్రకారమే అతడిని లోయ చివరికి తీసుకెళ్లి.. వెనుక నుంచి 400 అడుగుల లోతులోకి నెట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ప్రమాదం డ్రామా ఆడారని తేల్చారు.పోలీసుల అదుపులో ఎనిమిది మంది..ఈ ఘోర కుట్రకు సంబంధించి కేతన్ కాబోయే భార్యను, ఆమెకు సహకరించిన మిత్రుడిని పోలీసులు మంగళవారం అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్లానింగ్ లేదా హత్య జరిగిన సమయంలో అక్కడ ఉండి సహకరించారని భావిస్తున్న మరో ఆరుగురు స్నేహితులను కూడా పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని కాబోయే భార్యే చంపేయడం పూణే ప్రజల్లో తీవ్ర దిగ్ర్భాంతికి కల్గజేస్తోంది. అయితే హత్యకు గల పూర్తి కారణాలను రాబట్టేందుకు పోలీసులు నిందితులను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఆమె కాబోయే భర్తను ఎందుకు చంపింది, ఎవరితో కలిసి ప్లాన్ చేసిందనేది.