డ్రామా జూనియర్స్‌లో రోజా, అనిల్ రావిపూడి , శ్రీకాంత్, సుధీర్ కలిసి చేస్తున్న కామెడీ అందరికీ తెలిసిందే. షోలో పిల్లల స్కిట్ల కంటే వీరంతా కలిసి చేసే కామెడీనే ఎక్కువగా హైలెట్ అవుతోంది.
వచ్చే వారం వింటేజ్, రెట్రో థీమ్ గెటప్స్‌లో ఎపిసోడ్ రాబోతోంది. ఈ క్రమంలో రోజా, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ గెటప్స్ అదిరిపోయాయి. శ్రీకాంత్ రోజా ఏమో ఎన్టీఆర్, శ్రీదేవీ గెటప్స్‌లో వచ్చారు. అనిల్ రావిపూడి మాత్రం ఏఎన్నార్‌లా నటించాడు. నా హెయిర్ బ్యాండ్ ఎలా ఉంది అని రోజా అడుగుతుంది. వడ దెబ్బ తగిలితే తడి గుడ్డ కట్టినట్టుంది రాధ అని శ్రీకాంత్ కౌంటర్ వేస్తాడు.ఇక అనిల్ రావిపూడి స్టైల్‌గా ఏఎన్నార్ గెటప్‌లో వస్తాడు. నాన్న గారు.. అని రోజా పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్ సెన్స్.. నానా కష్టాలు పడి ఇక్కడకు వస్తే.. నీతో నాన్నా అనిపించుకోడానికా? అయినా అంత ఎనర్జీగా పరిగెడుతున్నావ్.. ఎన్ని టాబెట్లు వేసుకున్నావ్ ఏంటి? అని అనిల్ రావిపూడి కౌంటర్లు వేస్తాడు. ఇంతలో శ్రీకాంత్ వచ్చి.. మామయ్య అని అనిల్ రావిపూడిని పిలుస్తాడు. జాబిలమ్మలా ఉంది అని రోజా గురించి శ్రీకాంత్ అంటాడు. ఇప్పుడు జాబిలమ్మ లానే ఉంటుంది.. రాంగ్ టైంలో చూస్తే జేజమ్మలా ఉంటుంది అని అనిల్ రావిపూడి కౌంటర్ వేస్తాడు.ఊరిలో పెద్ద ఎదవ అని సుధీర్ ఎంట్రీ ఇస్తాడు. ఊరి పెద్ద అని సుధీర్ కవరింగ్ ఇస్తాడు. ఊరి పెద్దగా అని సుధీర్ అనడంతో.. ఈ దారుణం కంటే.. ఆవిడ నన్ను నాన్నా అని పిలవడమే బాగుంది.. అని అనిల్ రావిపూడి కౌంటర్ వేస్తాడు. ఇక చివరకు అనంత శ్రీరామ్ ఫ్లూట్ పట్టుకుని దిగుతాడు. ఆ ఫ్లూట్కి కాస్త దూరంగా ఉండు.. రెండింట్లో ఫ్లూట్ ఏదో .. నువ్వు ఎవరో కనిపెట్టలేకపోతోన్నాం అని రోజా పంచ్ వేస్తుంది. మీరు కూడా ఆ డ్రమ్ముకి దూరంగా ఉండండి అని అనంత శ్రీరామ్ కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు.ఆ తరువాత అనంత్ శ్రీరామ్ చేసిన స్కిట్, సుధీర్ పర్ఫామెన్స్, రోజా పంచ్‌లు ఇలా అన్నీ కూడా ప్రోమోలో హైలెట్ అవుతున్నాయి. డ్రామా జూనియర్స్‌లో పిల్లల కంటే జడ్జ్‌లు చేస్తున్న, ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. రోజా, అనిల్ రావిపూడి, శ్రీకాంత్, సుధీర్, ధన్య బాలకృష్ణ షోని సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇకపై నుంచి అనంత శ్రీరామ్ కూడా షోలో కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నారు.