
ఇంటర్నెట్‌డెస్క్: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) దిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చాడు.
దిల్లీ, లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన స్వాప్ డీల్‌లో భాగంగా పంత్ లఖ్‌నవూ జట్టు నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దిల్లీ నుంచి లఖ్‌నవూకు మారాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఘోరంగా విఫలమైంది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇటీవల పంత్ ఆ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు జట్టు మారాడు. కొత్త డీల్‌లో భాగంగా జీతంలో భారీకోతకు అంగీకరించాడు. ఇప్పుడు దిల్లీ అతడికి రూ.15 కోట్లు చెల్లించనుంది. కుల్దీప్ (Kuldeep Yadav) మాత్రం ప్రస్తుత ఫీజు రూ.13.50 కోట్లనే అందుకోనున్నాడు. ఈ ఒప్పందం గురించి రెండు జట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాయి.
2025 ఐపీఎల్ (IPL) మెగా వేలంలో పంత్‌ను లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఏకంగా రూ.27 కోట్లతో దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, పంత్ సారథ్యంలో లఖ్‌నవూ రెండు సీజన్లలో కలిసి కేవలం 10 మ్యాచ్‌లో గెలవడం గమనార్హం. 2025 సీజన్లో ఈ జట్టు ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఇక, బ్యాటింగ్ పరంగానూ పంత్ ఆకట్టుకోలేకపోయాడు. గత సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు చేసిన అతడు.. ఈ ఏడాది మొత్తంగా 312 పరుగులు సాధించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.