
ఇండియాతో పాటు చాలా దేశాల్లో మతం, కులంతో వివక్ష ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా మన దేశంతో క్యాస్ట్ ఫీలింగ్ తో చాలా వర్గాలను తక్కువగా చూడటం అందరికి తెలిసిందే.
కొన్ని దేశాల్లో జాతి వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. వైట్ స్కిన్, బ్లాక్ స్కిన్ అంటూ.. కొన్ని దేశాల్లో నల్లజాతీయులపై దాడులు కామన్ అయిపోయాయి. టెక్నాలజీ, సైన్స్ ఇంతలా పెరిగిన ఈ కాలంలో కూడా ఇంకా.. ఈ వివక్ష కనిపిస్తూనే ఉంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇవేమి ఉండవు. చాలా ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ.. మనిషులకు విలువిస్తుంటారు. మరి జపాన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది. జపానియూలకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? యూట్యూబర్ ఝాన్సీ చెప్పిన సంచలన నిజాలేంటి?
జపాన్ లో చాలామంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అంటూ ఇండియా నుంచి జపాన్ వెళ్లి బ్రతుకుతున్నారు.. వారిలో ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కొంత మంది ఉద్యోగస్తులు యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసి.. తమ అనుభవాలు, జపాన్ లో పరిస్థితులను వివరిస్తుంటారు. అలాంటి వారిలో ఝాన్సీ కూడా ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉద్యోగరిత్య జపాన్ వెళ్లిన ఆమె.. జాబ్ చేసుకుంటూనే అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు విషయాలను సేకరించి ''ఝాన్సీ ఇన్ జపాన్'' అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేస్తుంటుంది.
జపాన్ కల్చర్, అక్కడి జీవిన విధానం, విదేశీయులను ఎలా చూస్తారు, జపాన్ లో ఉండాలంటే రూల్స్ ఏంటి, మన దేశానికి జపాన్ కు తేడాలు ఏంటి ఇలా ఎన్నో విషయాలపై ఇప్పటికే ఆమె వీడియోలు చేశారు. ఈక్రమంలో ఆమెకు తన ఫాలోవర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురౌతుంటాయి. తన వీడియోలు చూసిన ఓ నెటిజన్ జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా అని ఆమెను ప్రశ్నించాడు. తన ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఝాన్సీ వీడియలో రూపంలో సమాధానం చెప్పారు.
ఈ విషయంపై ఝాన్సీ ఏమని సమాధానం చెప్పిందంటే? '' జపాన్ లో కులపిచ్చి, మత పిచ్చి అస్సలు ఉండవు. అందరిని సమానంగా చూస్తారు. చాలా కైండ్ గా ఉంటారు, పొలైట్ గా ఉంటారు. ముఖ్యంగా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా మర్యద ఇస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. నీది ఏ కులం ఏ మతం, అని అడగరు.. అసలు వారికి అలాంటివి ఉండవు కూడా. ఇక్కడ లోకల్ గా ఏమున్నాయి అనేది తెలియదు కానీ.. నాకు తెలిసి, నేను ఎక్స్ పీరియన్స్ చేసినంత వరకూ.. వివక్షను మాత్రం నేను చూడలేదు.
ఈ విషయంలో నేను ఓ ఎక్స్ పీరియన్స్ ను కూడా ఫేస్ చేశాను. ఓ సారి ఓ ఈవెట్ జరిగింది... అదంతా అయిపోయిన తరువాత చెత్తను క్లీన్ చేయడానికి కొంత మంది వచ్చారు. వారు అంతా క్లీన్ చేసి వెళ్లేప్పుడు.. ఈ ఈవెంట్ కు సంబంధించిన పెద్దలుఅంతా వచ్చి.. చెత్త క్లీన్ చేసేవారికి తల వంచి నమస్కారం చేశారు. ఇక్కడ పేద, ధనిక, డబ్బుంటేనే బాగా చూడటం, డబ్బులేకపోతే చిన్నచూపు చూడటం లాంటివి ఏమీ ఉండవు. అందుకే ఈ దేశం చాలా స్పీడ్ గా ముందుకు వెళ్లిపోతోంది. ఇక్కడి ప్రజలు చాలా వినయంగా, హంబుల్ గా ఉంటారు. ప్రతీ ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ దేశం నుంచి మనం నేర్చుకోవలసిన విషయం కూడా ఇదే.'' అని ఆమె వెల్లడించారు.
దేశం అభివృద్ది చెందాలంటే.. మనిషిని మనిషిలా చూడాలి.. వివక్ష లేని సమాజం ఉంటేనే సమానంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ విషయంలో కొన్ని దేశాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. చిన్నవే అయినా.. జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జపాన్ లో ప్రతీ పనిలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎదుటివారు ఇబ్బంది పడేలా నిర్ణయాలు ఉండవు. చిన్నతనం నుంచే ఎవరి పని వారు చేసుకోవడం నేర్చుకుంటారు. అక్కడి స్కూల్స్ లో క్రమశిక్షణకు ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలకు కూడా మందు నుంచే ఇలాంటివి అలవాటు చేస్తారు. పౌండేషన్ నుంచే ఇంత బలంగా ఉండబట్టే జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.