
మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జరిగిన ఎన్‌కౌం టర్కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి. నస్పూర్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జరిగిన ఎన్‌కౌం టర్కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి.
1996 జూన్ 23 ఆదివారం సింగరేణి కార్మికుల సెలవు దినం... కాలనీలోని డి-టైప్ క్వాటర్స్ ముందు వరుస లైన్ వద్దకు భారీగా చేరుకు న్న సాయుధ పోలీస్ బలగాలు... దీం తో అసలు ఏం జరుగుతుందో అర్థం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో సికాస నేతలను పట్టుకునేం దుకు పోలీసులు గాలింపు ముమ్మరంగా సాగుతున్న సమయం అది. అలాంటి సమ యంలో సికాస నేత మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ నస్పూర్ కాలనీలోని ఓ సింగరేణి క్వార్టర్లో ఆశ్రయం పొందినట్లు పోలీసులకు సమాచారం చేరింది.
దీంతో పోలీ సు బలగాలు ఆ క్వార్టర్‌ను చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారిగా కాల్పుల శబ్ధ... ఇరువైపు లా హోరాహోరీగా కాల్పులు మొదలయ్యాయి. దాదాపు 12 గంటలకుపైగా కాల్పులు జరిగాయి. అనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనం రేపిన ఎన్కౌంటర్ ఇది... ఈ ఎన్ కౌంటర్లో సికాస నేత రమాకాంత్ అలియాస్ మాదిరెడ్డి సమ్మిరెడ్డితో పాటు ఓ మహిళ, సీఐ, కానిస్టేబుల్ మృత్యువాత పడగా పలువురు పోలీసులు గాయాలకు గురైయ్యారు. ఈ సంఘటన జరిగి మంగళవారం నాటికి 30 ఏళ్లు గడిచాయి.
ఎన్కౌంటర్ అనంతరం పౌర హక్కుల సంఘ నేతలు, కవులు, రచయితలు సందర్శించారు. పట్టుకునే అవకాశం ఉన్నా కాల్చి చంపారని ఆరోపించారు. ఆనాటి ఎన్‌కౌంటర్‌ను కార్మికులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో ఏదైనా సమస్యపై సికాస పిలుపునిస్తే ఆ సమస్య సమసిపోయేది. అప్పట్లో సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు సింగరేణి కార్మికులచే 56 రోజుల పాటు సమ్మె చేయించింది.
ఒక విప్లవ సంస్థ పిలుపుతో జరిగిన సమ్మె ఆనాడు సంచలనం రేపింది. రమాకాంత్ ఎన్కౌంటర్ తర్వాత సికాస కార్యకలాపాలు కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. అనంతరం పూర్వవైభవం కోసం ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు ఎప్పటి కప్పుడు తిప్పికొట్టారు. ఆ తర్వాత జరిగిన పలు ఎన్కౌంటర్లలో ముఖ్య నేతలను కోల్పోవడంతో సికాస క్రమంగా కనుమరుగైంది.
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం
Read Latest AP News And Telangana News And International News And Telugu News