
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Samantha Come Back Movie: కథానాయికగా సమంత పని అయిపోయిందన్న వాళ్లకు ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. ఓ స్టారో మాదిరి మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీతో పలకరించి మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాలో ఎలాంటి అసభ్యరమైన సన్నివేశాలు లేకపోవడం.. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ .. తమ కుటుంబం కోసం ఓ మహిళ ఎలా తన శత్రువులపై పోరాటం చేసిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
మొదటి రోజు దాదాపు రూ.14 కోట్లతో ప్రారంభమై రోజు రోజుకు కలెక్షన్స్‌ను పెంచుకుంటూ పోతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడం.. టికెట్ రేట్స్ తక్కువగా ఉండటం వంటి అంశాలు ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ మార్క్‌తో పాటు రూ. 27 కోట్ల షేర్ వరల్డ్ వైడ్‌గా అందుకొని సంచలనం రేపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే రూ. 27 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర నిలకడగా వసూళ్లను రాబడుతుంది.
మొత్తంగా ‘మా ఇంటి బంగారం’ వంటి ఒకే ఒక హిట్‌తో బాక్సాఫీస్‌కు పెద్ద బూస్టప్ అందించింది. ‘ఓబేబి’ వంటి హిట్ మూవీ తర్వాత నందిని రెడ్డి, సమంత కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత తప్పించి పెద్దగా తెలియని హీరో, విలన్ వంటి వారు నటించారు. కేవలం సామ్ స్టార్ పవర్‌తో ‘మా ఇంటి బంగారం’ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.మొత్తంగా ఈ యేడాది 8వ క్లీన్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా జూన్ నెలలో ‘పెద్ది’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తప్పించి మిగిలిన చోట్ల పెద్దగా ఆడింది లేదు. కానీ ‘సామ్’ ..‘మా ఇంటి బంగారం’ తక్కువ బడ్జెట్లో ఓన్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్‌గా డిజిటల్, శాటిలైట్ రూపేణా రూ. 40 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా సమంత కు ఇది17వ సినిమా అని చెప్పాలి. ముందు ముందు ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.