
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
ABVP School Bandh in Sircilla Latest News: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందడుగు వేసింది.. ప్రభుత్వ పాఠశాలల విలీనంతో పాటు మూసివేత నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాగే విద్యారంగంలోని పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ABVP ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బందుకు పిలుపునిచ్చారు.. ఈ బంద్ పిలుపుతో పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ పూర్తిగా మూతపడ్డాయి.. ఉదయం నుంచి ఏబీవీపీ నాయకులతోపాటు కార్యకర్తలు పట్టణంలోని వివిధ పాఠశాలల వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శనలు చేపట్టారు..
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకే.. ఏబీవీపీ డిమాండ్లను ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య వ్యతిరేక విధానాల వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని మండిపడ్డారు.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను విలీనం చేయడం లేదా పూర్తిగా మూసి వేయడం వంటి నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా.. వాటికి అవసరమైన మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు..
ప్రధాన డిమాండ్లు ఇవే.. బంద్ సందర్భంగా విద్యార్థి నాయకులు ప్రభుత్వం ముందు పలు కీలకమైన డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది.. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేవని.. తక్షణమే పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పాఠశాలల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. పాఠశాలల నిర్వహణను మెరుగుపరచాలని కోరారు..
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటితో పాటు మరుగుదొడ్లను, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. బందులో భాగంగా విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి.. ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు తెలిపారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేశారు. అన్ని సమస్యలపై స్పందించి విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.