
మా చిన్నప్పుడే నాన్న తాగి కొట్టడం వల్ల అమ్మ చనిపోయింది. అప్పుడు ఆయన తదనంతరం తన ఆస్తి అంతా నాకూ చెల్లికే అని విల్లు రాయించారు. తర్వాత మరో పెళ్లి చేసుకున్నారు. పిన్నికి కూడా ఇద్దరు పిల్లలు.
మా చిన్నప్పుడే నాన్న తాగి కొట్టడం వల్ల అమ్మ చనిపోయింది. అప్పుడు ఆయన తదనంతరం తన ఆస్తి అంతా నాకూ చెల్లికే అని విల్లు రాయించారు. తర్వాత మరో పెళ్లి చేసుకున్నారు. పిన్నికి కూడా ఇద్దరు పిల్లలు. అప్పుడు మాకు రాసిన ఆస్తిలో ఈ ఇద్దరికీ వాటా ఉందంటోంది పిన్ని. తర్వాత నాన్న పొలం కొన్నారు. అవి మాత్రం తన పిల్లలకే అని చెబుతోంది. చట్టపరంగా ఇందులో మాకు దక్కే వాటాలేంటి? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రస్తుతం మేం మా అమ్మమ్మ ఇంట్లోనే పెరుగుతున్నాం.
మీ నాన్న రాసిన వీలునామా ఆయన తదనంతరమే మీకు చెందుతుంది. విల్లుని జీవిత కాలంలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. మీ తండ్రి తన పిత్రార్జితపు ఆస్తిలో భాగం పంచుకుని ఉంటే అది ఆయనకి స్వార్జితం అవుతుంది. దాన్ని మీ ఇద్దరికీ వీలునామా రిజిస్టర్ చేసినా మీ పిన్ని బలవంతం మీద మార్చి రాయడానికి అవకాశం ఉంది. మీ నాన్న సొంతంగా కొన్న పొలం ఆయన స్వార్జితం. దాన్ని ఎవరికి రాస్తే వాళ్లకే చెందుతుంది. మీ పిన్ని ఆయనతో విల్లు మార్పిడి చేయించకుండా ఉండాలంటే ఆ వీలునామాను మార్చి, గిఫ్ట్ డీడ్‌గా రిజిస్టర్ చేయించుకోవాలి. అందుకు పెద్ద మనుషులు లేదా మీడియేషన్ సెంటర్ వాళ్ల సాయం తీసుకోండి. గిఫ్ట్ ద్వారా వచ్చిన ఆస్తి వెంటనే స్వాధీనమవుతుంది. అందుకు మీ నాన్న, పిన్ని ఒప్పుకోవాలంటే మొత్తం ఆస్తి నాలుగు భాగాలు చేసి నలుగురు పిల్లలకు చెందేలా ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాయించండి. అందులో ఆవిడతోనూ సంతకం పెట్టిస్తే భవిష్యత్తులో మళ్లీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దీనికి మధ్యవర్తుల సాయం అవసరం. తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.