
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఫ్యామిలీలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య, నటి శిరీష పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో..
ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం.
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ (Nara Rohith) ఫ్యామిలీలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య, నటి శిరీష (Sireesha) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని నారా కుటుంబ వర్గాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ, ఫ్యామిలీ అంతా ఆనందంలో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపినట్లుగా టాక్ నడుస్తోంది. నారా వారి ఇంట్లో (Nara Family)కి సరికొత్త వారసుడు అడుగుపెట్టడంతో కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజులకే నారా రోహిత్ తన తండ్రి (నారా రామ్మూర్తి నాయుడు)ని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోగా.. ఇప్పుడు ఈ చిన్నారి రాక ఆ కుటుంబంలో సరికొత్త కాంతులను, రెట్టింపు సంతోషాన్ని తీసుకువచ్చింది.
నారా రోహిత్, శిరీషల విషయానికి వస్తే.. వీరిద్దరిది సినిమా సెట్స్‌పై మొదలైన పరిచయం. వీరిద్దరూ కలిసి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ప్రతినిధి 2’ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది 2025 అక్టోబర్ 30న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన కొద్ది నెలలకే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో నారా-నందమూరి ఫ్యామిలీలో ఆనందం వెల్లువెత్తుతోంది.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. నారా రోహిత్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కబోతోన్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. అటు పర్సనల్ లైఫ్‌లో తండ్రిగా సరికొత్త ఆధ్యాయం మొదలు పెట్టిన నారా రోహిత్.., ఇటు కెరీర్ పరంగానూ బిజీ నటుడిగా తన సత్తా చాటుతున్నారు. ఇక నారా వారి వారసుడికి సంబంధించి అధికారిక ప్రకటనను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాల్సి ఉంది.
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక