
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై కుటుంబ...
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, కుమార్తె క్రాంతి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఆయన కోలుకుంటున్నారని, వదంతులు నమ్మవద్దని కుటుంబ సభ్యులు చెబుతుండగా, మరోవైపు తన తండ్రి వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నారని కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ తీరుపై క్రాంతి తీవ్ర అసహనంతన తండ్రి ఆరోగ్యంపై స్పందించిన క్రాంతి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "వైసీపీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్‌లకు ఇచ్చిన విలువ.. జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న నా తండ్రికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా నాన్న వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే, కనీసం పరామర్శించడానికి కూడా జగన్‌కు తీరిక లేదా?" అంటూ ఆమె ప్రశ్నించారు. "మీ అవసరం ఉన్నంతవరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత మా నాన్న గారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా?" అని నిలదీశారు.కుటుంబంలో విభేదాలు.. భిన్న వాదనలుముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రకటనకు, కుమార్తె క్రాంతి చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదు. ముద్రగడ అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పది రోజుల పాటు విశ్రాంతి సూచించారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే క్రాంతి మాత్రం తన