
టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను, కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గుగురయింది.
తన కోసం తన తల్లి ఏకంగా నగలు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిందని, వారి త్యాగాలను వృధా కానివ్వననే పట్టుదలతోనే ఆడుతున్నానని ఆమె వెల్లడించింది. ఇటీవల జియోస్టార్తో మాట్లాడుతూ ఆమె తన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని పంచుకుంది.మధ్యప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను, అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం అంత సులభంగా జరగలేదని తెలిపింది. శ్రీలంకలో దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్లో వన్డే అరంగేట్రం చేసిన ఆమె, ఇంగ్లండ్ పర్యటనలో టీ20ల్లోకి అడుగుపెట్టింది. అదే పర్యటనలో ఒక మ్యాచ్లో 52 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.ఆడపిల్లలు బయటకే రాకూడదనేవారు..తన ప్రారంభ రోజుల గురించి క్రాంతి మాట్లాడుతూ.. "నేను క్రికెట్ ఆడతానని పెద్దగా కలలు కనలేదు. మాది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఆడపిల్లలు స్వేచ్ఛగా బయటకు అడుగుపెట్టడమే కష్టం. అమ్మాయిలు బయటకు వస్తే లేదా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే, చుట్టుపక్కల వారి నుంచి విమర్శలు, హేళనలు ఎదుర్కోవాల్సిందే. కానీ కష్టపడి పనిచేసే వారు ఎప్పటికీ ఓడిపోరని నేను నమ్మాను. అందుకే నా పని నేను చేసుకుంటూ పోయాను. బౌలింగ్ చేస్తూ, నేర్చుకుంటూ, నన్ను నేను నమ్ముతూ ముందుకు సాగాను. ఈ రోజు నేను టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నాను. ఈ జెర్సీ ధరించి ఈ పెద్ద వేదికపై నిలబడినప్పుడు, నేను పడిన