
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Veerabhadruni Rahasyam ZEE5 OTT Streaming: తెలుగు సహా మన దేశంలో టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ స్టోరీని తీసుకురాబోతోంది. అదే ‘మర్మదేశం అనే ప్రపంచం నుంచి ‘వీరభద్రుని రహస్యం’. ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కల్ట్ మిస్టరీ సిరీస్ సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే తెలుగు ఐఎండీబీ హయ్యస్ట్ రేటింగ్ సాధించి అందరి దృష్టిని అప్పట్లో ఆకర్షించింది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో ఈ సిరీస్ ఉండనుంది. ప్రజల నమ్మకం, విశ్వాసాలు, ఆజ్ఞలను విధించే శక్తిగా మారి..భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. దేవుడిపై ఉన్న ప్రగాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈ కథలో వెలుగులోకి రాబోతున్నాయి.
కొన్ని గ్రామాలు రహస్యాలను కాపాడుకుంటే.. మరికొన్ని వాటి మీదనే నిర్మింపబడ్డాయి.
కథ విషయానికి వస్తే.. తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండదండలతో బతుకుతుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడని అందరూ విశ్వసిస్తుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా..ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు కనిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దేవుడు చేసిన న్యాయంగా భావిస్తుంటారు. అయితే వాటి వెనుక నిజం ఏమిటో అని ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వచ్చే ధైర్యం చేయరు. తరతరాలు వారందరూ పాటిస్తున్న సాంప్రదాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొనసాగేలా చేస్తుంది. దీంతో వారు బలవంతంగా, దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు.
మూఢనమ్మకాలతో నిండిన వింత ప్రపంచం వంటి వీరభద్రపురం అనే ప్రపంచంలోకి సిటీ నుంచి వచ్చిన వెన్నెల అనే యువతి (అన్నీ) ఎలా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆమె వచ్చిన సమయంలో గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. అయితే అక్కడి ప్రజలు దాన్ని దేవుడు వేసి శిక్షగా భావిస్తుంటారు. కానీ వెన్నెల మాత్రం వారి నమ్మకాన్ని ఒప్పుకోదు. నిజాన్ని వెలికితీయాలనే ఆమె సంకల్పం గ్రామాన్ని పట్టి కుదిపేస్తుంది. శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుంది. గతాన్ని దాచిపెట్టాలని చూసే శక్తివంతులైన వ్యక్తులతో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది.
వెన్నెల లోతుగా అన్వేషణ చేసుకుంటూ వెళ్లే కొద్దీ.. గ్రామంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. భక్తి పేరుతో దాగి ఉన్న దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, తరతరాల భయాల వెనుక దాచిన చీకటి గతం బయటపడుతుంది. 1970ల కాలానికి వెళ్లి ఈ ఘటనల మూలాలను అన్వేషించటం ద్వారా ఈ గ్రామాన్ని నడిపిస్తున్న కథలు, శక్తి, ఆశ, మాయాజాలంతో రూపుదిద్దుకున్నాయో ఈ సిరీస్‌లో చూపెట్టబోతున్నారు. ఇది విశ్వాసం, తర్కం మధ్య జరిగే గట్టిపోరు. ప్రతి సమాధానం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది, ప్రతి నిజం బయటపడే కొద్ది ఎవరూ ఊహించని వాస్తవాలు బయటకు రాబోతున్నాయనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో పెంచుతుంది.
భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, అభినవ్‌గా ఎస్ఐ రవి, డా. నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, నాంచారిగా అనురాధ, గురునాధన్‌గా బాలచంద్ర, బ్రహ్మంగా కల్కి, యంగ్ కార్తికేయగా హార్విన్ రెడ్డి కనిపించనున్నారు. క్రియేటివ్ టీమ్ విషయానికి వస్తే సుభాష్ సినిమాటోగ్రఫీ అందించారు. సంగీత దర్శకుడిగా సుధా శ్రీనివాస్. ఎడిటర్‌గా రాగం సత్య నితీష్. రుద్రరాజు చాణక్య వర్మ స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేశారు. రచయితగా అంజన్ మేగోటి పనిచేశారు.
మొత్తం 60 ఎపిసోడ్లతో ‘వీరభద్రుని రహస్యం’ రాబోతుంది. ఓ రకంగా లాంగ్-ఫార్మ్ మిస్టరీగా క్రమంగా రహస్యాలు..ట్విస్టులను బయటపెడుతూ ముందుకు సాగుతుంది. ఈ సిరీస్ జూన్ 26న రెండు ఎపిసోడ్లతో ప్రారంభమై తర్వాత ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతుంటాయి. దీంతో సస్పెన్స్, ఉత్కంఠ, అనూహ్య మలుపులతో నిండిన ఈ కథలో ప్రేక్షకులు మరింతగా లీనమవుతారనటంలో ఎలాంటి సందేహం లేదు.
మిస్టరీ, జానపదం, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాను ప్రత్యేకమైన తెలుగు నేపథ్యంతో కలిపిన ఈ సిరీస్, పురాణం..వాస్తవం మధ్య ఉండే సన్నటి గీత వెనక ఉణ్న రహస్యాన్ని ప్రేక్షకులకు అందించబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.