నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని క్వీవ్లాండ్ క్లీనిక్ రిపోర్ట్ తెలిపింది.
స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్‌లోని ఫాలీఫెనాల్స్‌కు యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి.
బ్రోకలీలో విటమిన్ ఎ, సి, ఇ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడతాయి. బ్రోకలీ తింటే కణాలు ఆరోగ్యంగా మారుతాయి.
క్యాప్సికమ్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్ తింటే వ్యాధినిరోధకశక్తి బలంగా మారుతుంది. దీంతో వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.
పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. పాలకూర తింటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
బాదం గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం పప్పులు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. సన్‌ఫ్లవర్ విత్తనాలు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం వ్యాధినిరోధకశక్తిని బలంగా మార్చుతుంది.