మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రామ్ చరణ్ మార్క్ యాక్టింగ్, ఎమోషన్స్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘పెద్ది’ విజయం తర్వాత రామ్ చరణ్ తొలిసారి ఒక ప్రముఖ జాతీయ వేదికపై సందడి చేశారు. రిపబ్లిక్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమ్మిట్ 2026’ దేశవ్యాప్త సదస్సులో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ చిత్ర పరిశ్రమ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు మరియు థియేటర్ అనుభవం గురించి చరణ్ తన అంతరంగిక అభిప్రాయాలను పంచుకున్నారు.* నారా లోకేష్‌తో పోలిక... నేషనల్ మీడియా డిబేట్లో రామ్‌చరణ్ క్రేజీ కామెంట్స్ ‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’ అనే ప్రధాన థీమ్‌తో జరిగిన ఈ సమ్మిట్‌లో రామ్ చరణ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరల భారంపై ఆయన గళం విప్పడం పెద్ద చర్చకు దారితీసింది. దేశంలో సాధారణ ప్రజానీకానికి ఇప్పటికీ అత్యంత చౌకైన మరియు అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధనం కేవలం సినిమా మాత్రమేనని చరణ్ అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసి థియేటర్‌కు వెళ్లి వెండితెరపై సినిమాను ఆస్వాదించడం అనేది ఒక విలక్షణమైన సామూహిక అనుభూతి అని, అది కేవలం టైమ్‌పాస్ వినోదం మాత్రమే కాకుండా కుటుంబాల మధ్య బంధాలను సైతం బలపరుస్తుందని చరణ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ప్రధాన అడ్డంకిగా మారిన స్నాక్స్ ధరల సమస్యను ఆయన ఈ వేదికపై ప్రస్తావించారు. మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలను కొంతమేరకైనా తగ్గిస్తే, ప్రేక్షకులకు సినిమా చూసే అనుభవం మరింత ఆహ్లాదకరంగా, భారంగా అనిపించకుండా ఉంటుందని చరణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్నాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలా మంది కుటుంబ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారని, ఈ ఖర్చులకు భయపడి కొందరు థియేటర్ల వైపు రావడానికే వెనుకంజ వేస్తున్నారంటూ అసలు నిజాన్ని కుండబద్దలు కొట్టారు.* నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సులో ఒక స్టార్ హీరో సామాన్యుల పక్షాన నిలబడి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ యాజమాన్యాల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. సాధారణ ప్రేక్షకులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ఈ తినుబండారాల దోపిడీ సమస్యను రామ్ చరణ్ బహిరంగంగా నిలదీయడాన్ని సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ మెగా హీరోకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.