ముఖాన్ని శుభ్రంగా కడిగి స్వచ్ఛమైన, తాజా కలబంద జెల్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయండి. రాత్రంతా ఈ మాస్క్‌ను ఉంచి ఉదయం ముఖం కడిగితే అందం రెట్టింపు అవుతుంది. చర్మం తాజాగా ఉంటుంది.
కలబంద జెల్లో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ లేదా గ్రీన్ టీ కలిపి ఫ్రిజ్‌లో ఉంచి క్యూబ్స్ తయారు చేయండి. వీటిని ముఖానికి రాయడం వల్ల అందం పెరుగుతుంది.
రెండు స్పూన్ల తాజా కలబంద జెల్‌ను ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండితో కలిపి ముఖానికి రాయండి. ఈ మిశ్రమంతో ఎక్స్ఫోలియేట్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
రెండు స్పూన్ల కలబంద జెల్లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత ముఖం కడిగితే చర్మం అందంగా మారుతుంది.
ఒక స్పూన్ కలబంద జెల్లో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి ముఖానికి రాయండి. వీటిలోని పోషకాలు మొటిమలను మాయం చేస్తాయి.
కలబంద జెల్లో కొద్దిగా రోజ్ వాటర్ ముఖానికి స్ప్రే చేయండి. ఇది ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. జిడ్డును తగ్గిస్తుంది.
కలబంద జెల్లో విటమిన్ ఇ నూనె కలిపి కంటి కింద అప్లై చేయండి. ఇది కంటి కింద నలుపును మాయం చేస్తుంది.
స్వచ్ఛమైన కలబంద జెల్‌ను నేరుగా చర్మానికి రాయండి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎండ నుంచి రక్షణ కలిపిస్తాయి.
కీరదోస రసాన్ని కలబంద జెల్‌తో కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది. వాపు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.