
చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్స్ విషయంలో రూ.50 కోట్ల మార్క్ అందుకోగా..
Jun 23 2026 11:04 AM | Updated on Jun 23 2026 11:12 AM
చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్స్ విషయంలో రూ.50 కోట్ల మార్క్ అందుకోగా.. ఇప్పుడు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత దంపతులు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది)
సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న తర్వాత సామ్ నుంచి ఈ మూవీ వచ్చింది. దీనికి స్టోరీ రాజ్ అందించారు. నందిని రెడ్డి దర్శకురాలు. పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే సమంత దంపతుల్ని ఇంటికి పిలిపించుకున్న చిరు దంపతులు.. చీర, ప్రత్యేక బహుమతిని అందజేశారు. మరోవైపు సామ్ ప్రెగ్నెన్సీ గురించి చిరు లీక్ చేశారు.
సినిమా, సమంత ఫెర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేసిన చిరంజీవి.. చీరలో సమంత ఫైట్స్ అదరగొట్టేసిందని మెచ్చుకున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న రాజ్-సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని సామ్ ప్రెగ్నెన్సీ గురించి చిరు పరోక్షంగా బయటపెట్టేశారు. రీసెంట్‌గానే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఈ ఏడాది డిసెంబరులోనే బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. కాకపోతే సమంత గానీ రాజ్ గానీ దీని గురించి అధికారికంగా చెప్పలేదు.
(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు