
వెయిట్‌లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది.
Jun 23 2026 11:09 AM | Updated on Jun 23 2026 11:16 AM
వెయిట్‌లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. తాజాగా ఆ కోవలోకి మరో ఫిట్నెస్ ట్రైనర్ చేరారు. ఆమె తాను చేస్తున్న తప్పిదాలను సరిచేసుకుంటూ బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారామె. అధిక బరువుని తగ్గించుకోవడానికి ఆంటకంగా ఉన్న అలవాట్లకు స్వస్తి పలికి మరీ ఏకంగా 23 కిలోలు తగ్గారు. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.
ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా అందుకోసం ఎలాంటి క్రాష్ డైట్లు, డిటాక్స్ టీలను తీసుకోలేదు. కేవలం తన వెయిట్‌లాస్ జర్నీలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని మంచి ఫలితాలను అందుకున్నట్లు చెబుతోంది ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా. ఆమె ఏ అలవాట్లను వదులుకున్నారు..ఏ తప్పిదాలను పునరావృతం కానివ్వలేదంటే..
అల్పాహారం మానేయడం.. బరువు తగ్గాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేసేదాన్ని దాంతో విపరీతమైన ఆకలితో ఉండేదాన్ని అన్నారు. ఫలితంగా జీవక్రియ మందగించేది. అదీగాక నేరుగా రాత్రిపటే తినేదాన్ని అన్నారు. దీని వల్ల తెలియకుండానే ఎక్కువ తినేయడం, బరువులో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనించి ఆ విధానాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు. ఆ తర్వాత నుంచి నిద్రలేచిని గంటలోపే తినడం మొదలు పెట్టానని అన్నారు.
చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం.. జ్యూస్‌లు, చక్కెరతో కూడిన టీ, కోల్డ్ కాఫీ వంటి ద్రవాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించినా..అవి ఎంతమంది మంచివి కావని అన్నారు. అందుకు బదులుగా నీళ్లు, బ్లాక్ కాఫీ, చక్కెర లేని సాధారణ టీ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు.
ఆరోగ్యకరమైన ఫుడ్స్ మోతాదు మేరకే.. మఖానా, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటివి ఆరోగ్యకరమైనవే అయినా..మోతాదు మేరకు తీసుకుంటేనే మంచివని అన్నారు. ఎంత పోషకవంతమైనదైనా..కేలరీల లెక్క మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అదనపు మోతాదులు త్వరగా కేలరీలను పెంచేస్తాయన్నారు.
వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయకపోవడం.. తాను బరువులు ఎత్తడం మొదలు పెట్టాకే శరీరంలో నిజమైన మార్పు రావడం కనిపించింది. ట్రెడ్‌మీల్ మీద గంటల తరబడి ఉండటం కంటే..ఇలాంటివి మంచివని తెలుసుకున్నానని అన్నారు.
తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడి రాత్రిపూట ఆలస్యంగా నిత్రపోవడం, కార్డిసాల్ స్థాయిలు అధికంగా ఉండటం తదితరాల వల్ల తెలియకుండానే అధికంగా తినాలేన కోరక కలుగుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని అన్నారు.
బయట తినడం మానేయడం.. రెస్టారెంట్ భోజనం అప్పడప్పుడు పర్లేదనే భావన తప్పుడు ఆలోచన అని అంటోంది. ఇంటి భోజనమే మంచిదని, వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారికి ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది.
చీట్ మీల్ వద్దు.. పోనీలే సరదాగా పిజ్జా, కేక్ చిన్న ముక్కే కదా వంటివి వద్దు. ఏది చేసినా..పరిపూర్ణత కంటే..నిలకడగా చేయడం అనేది అత్యంత ప్రధానం అని గ్రహించండని నొక్కి చెబుతోంది.
మంచి సమయం లేదా..అనుకూలమైన రోజు అంటూ గడపడం ఏ దినచర్య పాటించడానికి అయినా..క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఏ మార్పు చేసినా..సరైన సమయం కోసం కాకుడం వెంటనే ఆచరించడండని అన్నారు.
ప్రతీరోజు ఆలోచనాత్మకంగా ఆరోగ్యదాయకమైనవి ఎంచుకుంటూ స్థిరంగా బరువు తగ్గడం కీలకం. అదే మిమ్మల్ని నాజూకుగా మారుస్తుందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా నెట్టింట షేర్ చేశారు.
గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.
(చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..)
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు