
శతాంక యోగం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. బుధ, శని గ్రహాల ప్రత్యేక కలయిక కారణంగా ఈ రాశికి చెంది
న ఉద్యోగులకు మంచి ప్రశంసలు పొందుతారు. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. సంపద రెట్టింపు అవుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది.
మిథున రాశి కి బుధుడు అధిపతి. బుధ, శని గ్రహాలతో ఏర్పడిన ఈ శతాంక యోగం ఈ రాశివారికి చాలా ప్రయోజరకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు పొందుతారు. పనితీరు మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీడియా, రచన, మార్కెటింగ్, విద్య, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. డబ్బుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.
కన్య రాశికి కూడా బుధుడు అధిపతి. ఈ శతాంక యోగం కారణంగా కన్య రాశివారికి చాలా శుభయోగంగా ఉంటుంది. మంచి ప్రాజెక్టులు మీకు లభిస్తాయి. దీని వల్ల ఊహించని ధన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు చేసేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మకర రాశివారికి శని అధిపతి. శని, బుధ గ్రహాల కారణంగా ఏర్పడుతున్న శతాంక యోగం.. ఈ సమయంలో మకర రాశివారిి చాలా అనుకూలంగా ఉంటుంది. పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మంచి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు.సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.