
హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, జూన్ 23: హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారు
ల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసీబీ వరుసగా సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో వందల కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. తాజాగా.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి.
ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. మొత్తం పదిచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News