
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
US Iran Peace Talks: స్విట్జర్లాండ్‌లోని బ్యుర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా, ఇరాన్, పాకిస్థాన్, ఖతార్ ప్రతినిధుల మధ్య తొలి రౌండ్ సమావేశాలు జరిగాయి. అయితే, లెబనాన్‌లో దాడులు ఆగకపోతే చర్చలు ముందుకు సాగవని ఇరాన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా కార్యకలాపాలపై ట్రంప్ స్పందిస్తూ సైనిక చర్యల వరకు హెచ్చరించడంతో ఇరాన్ బృందం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఆ తర్వాత స్విట్జర్లాండ్ సమావేశాన్ని రద్దు చేసినట్లు ది గార్డియన్ ధృవీకరించింది. లెబనాన్‌లో యుద్ధం ఆగేంత వరకు ఇరాన్ ఎలాంటి తుది ఒప్పందానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని.. గత వారం కంటే ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. డీల్ కుదరకపోతే హర్మూజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటామన్నారు.
హర్ముజ్‌ను క్లోజ్ చేస్తే మీకు దేశం లేకుండా చేస్తామన్న తీవ్ర హెచ్చరికలు చేశారు ట్రంప్. హిజ్బొల్లాను అదుపు చేయకపోతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామన్నారు. లెబనాన్‌లో సమస్యలు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ వెంటనే నియంత్రించాలని తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. 60 రోజుల్లో ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే హర్మూజ్‌లో టోల్స్ వసూలు చేస్తామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.