
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Sun And Venus Transit June 22 Effect On Zodiac: జూన్ 22వ తేదీన సూర్య శుక్ర గ్రహాల మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇవి తమ నక్షత్రాలను మార్చుకున్నాయి. ఈరోజు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయగా.. శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేశాడు.. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ధైర్యంతో పాటు సాహసం, ఆనందానికి సూచికగా భావిస్తారు. ఇక శుక్రుడిని సంపద శ్రేయస్సు వ్యాపారం ఉపాధితో పాటు ఇతర శుభ పనులకు సూచికగా భావిస్తారు. అలాంటిది ఈ రెండు గ్రహాలు సంచారం చేశాయి. ఇదిలా ఉంటే.. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాగా.. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు.. జూన్ 22వ తేదీన ఈ రెండు గ్రహాలు ఏకకాలంలో తమ నక్షత్రాలను మార్చుకోవడం అరుదైన యాదృచ్ఛికంగా భావిస్తారు.. దీని కారణంగా మూడు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరే అవకాశాలు కనిపించబోతున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..
తులారాశి: సూర్య శుక్ర గ్రహాలు ఏకకాలంలో సంచారం చేయడం కారణంగా.. ముఖ్యంగా తులా రాశి వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. వీరికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. అనుకుంటున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే వీరికి ధైర్య సాహసాలు పెరిగి ఆత్మీయంలో మద్దతు లభించి కష్టతరమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో మీకు అనుకూలంగా పనులు చేయగలుగుతారు..
మకర రాశి: సూర్య శుక్ర గ్రహాల అరుపులు అనేక విధాలుగా మకర రాశి వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారందరికీ పదోన్నతులు కూడా తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశి వారు తమ వ్యాపారాలను ఊహించని స్థాయిలో విస్తరించే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి. అలాగే మీకు అందరి సపోర్టు లభించి అనుకుంటున్న పనులు ఎంతో సింపుల్ గా చేయగలుగుతారు..
కుంభరాశి: కుంభరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో ఆకర్షణతో పాటు పురోగతి విపరీతంగా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. అలాగే వృత్తి జీవితం మెరుగుపడడమే కాకుండా.. అనుకున్నన్నీ ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలపరంగా దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. అదృష్టం కలిసి వస్తే ఆ సంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా కొత్త మార్గాల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది అని జ్యోతిష్యులు చెబుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.