Latest Gold Jewellery Rates : బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగ్గా ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు.
అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగ్గా ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టింది. ఇక్కడ క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నప్పటికీ ఇదే సమయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తుల్లో వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే- యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరిగి ఇదే సమయంలో బంగారం ఆకర్షణ కోల్పోతుంటుంది. ధరలు దిగొస్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చల్లోనూ ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో తాజాగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు 4200 డాలర్లపైన ఉండగా ఇది రాత్రికి రాత్రే 80 డాలర్లకుపైగా పతనమై ప్రస్తుతం 4130 డాలర్ల స్థాయికి చేరింది. సిల్వర్ రేటు కూడా భారీగా తగ్గి 63 డాలర్ల స్థాయికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 94.70 వద్ద ఉంది. దేశీయంగా బంగారం ధరలు చూస్తే తాజాగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1900 పెరగ్గా 10 గ్రాములకు రూ. 1,33,750 వద్ద ఉంది. దీనికి ముందు రూ .1750 పెరగ్గా, జూన్ 20న రూ. 200 మేర పెరిగింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2070 తగ్గి తులం రూ. 1,45,910 వద్ద ఉంది. ఇది గత 3 రోజుల్లో చూస్తే రూ. 220, రూ. 1900 మేర పెరిగింది. లేటెస్ట్ గోల్డ్ జువెల్లరీ రేట్లు ఇవే..దేశంలోని ప్రముఖ జువెల్లరీల్లోనూ జూన్ 23న ఉదయం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లలితా జువెల్లరీలో ఉదయం 10.20 గంటల సమయంలో గ్రాము గోల్డ్ రేటు రూ. 13,375 గా ఉంది. తనిష్క్ జువెల్లరీలో బంగారం ధరలు వార్త రాసే సమయంలో ఇంకా మారలేదు. ఇక్కడ గ్రాముకు రూ. 13,610 వద్ద ఉంది. ఖజానా, కల్యాణ్ జువెల్లర్స్, జోయాలుక్కాస్‌లో కూడా గ్రాము పసిడి ధర రూ. 13,375 వద్ద ఉంది.రూ. 5 వేలు తగ్గిన సిల్వర్ రేటు..బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా మళ్లీ దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు రూ. 5 వేలు తగ్గగా కేజీకి రూ. 2.50 లక్షల వద్ద ఉంది. సిల్వర్ ధర గత 8 రోజులుగా పెరగట్లేదు. ఈ క్రమంలో రూ. 30 వేల వరకు తగ్గడం విశేషం.