
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ మళ్లీ కప్పు కొట్టేందుకు దూసుకెళ్తోంది.
స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె మరోసారి డబుల్ గోల్స్‌తో మెరవడంతో ఇరాక్‌పై ఈ జట్టు 3-0తో విజయం సాధించింది. దీంతో నాకౌట్లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్ తరఫున ఔస్మనె డెంబెలె మరో గోల్ చేశాడు.
27 ఏళ్ల ఎంబాపెకు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్. వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన ఈ మ్యచ్‌లో ఎంబాపె 14, 54వ నిమిషాల వద్ద రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే సరికొత్త ఘనత సాధించాడు. మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్న ఎంబాపె ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జర్మనీకి చెందిన మిరస్లావ్ క్లోజ్ (16) రికార్డును సమం చేశాడు. ఇక, ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రియాపై జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు గోల్స్ చేయడంతో.. అతడి మొత్తం గోల్స్ సంఖ్య 18కు చేరింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.