
క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఏ ఒక్క పేదవాడు ప్రాణాలు కోల్పోకూడదని, మరే కుటుంబంలోనూ ఇటువంటి విషాదం నిండకూడదని తన మాతృమూర్తికి ఇచ్చిన మాట మేరకు ఆ నిబద్ధత కొనసాగుతోంది.
శోకం నుంచి శ్లోకం పుట్టి రామాయణం ఆవిర్భవించినట్లుగానే, తల్లిని కోల్పోయిన ఆవేదన నుంచి నందమూరి కుటుంబం సమాజం పట్ల ఒక గొప్ప బాధ్యతను భుజానికెత్తుకుంది. మహానాయకుడు ఎన్టీఆర్ తన భార్య స్మారకార్థం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. మాతృమూర్తికి ఇచ్చిన మాటకు కట్టుబడి, సమాజ శ్రేయస్సు కోరి గత 25 ఏళ్లుగా ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యాన్ని ఈ సంస్థ ద్వారా అందిస్తున్నారు. ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తన సహచర సభ్యుల సహకారంతో ఈ ఆసుపత్రిని ఒక సేవా యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన మైలురాళ్లను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆసుపత్రి ఆరంభం నుంచి నేటి వరకు పెరిగిన వైద్య సౌకర్యాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు, రోగులు మరియు వారి బంధువులకు కల్పిస్తున్న వసతులు, అలాగే భవిష్యత్తు ప్రణాళికలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించారు.**పేదలకు సేవచేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే**"మానవత్వం నా ఆదర్శం - సమాజమే దేవాలయం - పేదలే దేవుళ్లు - వారికి చేసే సేవయే పరమాత్ముడికి చేసే సేవ" అన్న ఎన్టీఆర్ ఆశయాలను బసవతారకం ఆసుపత్రి తన సిద్ధాంతంగా మలుచుకుంది. లాభాపేక్ష లేకుండా, కేవలం మానవతా దృక్పథంతో ఈ