
గుండెపోటు రావడానికి కేవలం హై కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు. చాలామంది గుండెపోటుతో ఎమర్జెన్సీ వార్డులో చేరినప్పుడు వారి కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణంగానే ఉంటున్నాయి.
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటమే గుండెపోటుకు ప్రధాన సంకేతాలు. మన జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటివి సరిగ్గా ఉంటేనే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.
చాలామంది విజయం సాధించడం కోసం కేవలం ఉన్నత స్థానాల్లో ఉన్న మార్గదర్శకుల వెంటే పడుతుంటారు. కానీ, మనతోపాటు సమానంగా ప్రయాణిస్తూ, అదే లక్ష్యం కోసం శ్రమిస్తున్న తోటివారితో కలిసి పనిచేయడం అత్యంత శక్తిమంతమైన వ్యూహం. ఒకే లక్ష్యంతో నడిచే నిజాయతీ గల వ్యక్తులు ఒకచోట చేరి, తమకు పనికొచ్చే వ్యూహాలను పంచుకున్నప్పుడు.. అది మరెవ్వరికీ లేని ఒక ప్రత్యేకమైన, తిరుగులేని శక్తిగా మారుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగే అత్యంత గొప్ప కానుకలలో ‘ఆత్మవిశ్వాసం’ ఒకటి. స్వతంత్రంగా ఆలోచించే ధైర్యం, నిర్ణయాలు తీసుకునే చొరవ, తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకునే గుణం, పడినా మళ్లీ కోలుకునే శక్తిని వారికి అందించడమే అసలైన పెంపకం. ఎందుకంటే జీవితంలో ఎదిగే కొద్దీ ఇతరులపై ఆధారపడడం అలవాటైపోతే.. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడం సగం వయసు గడిచేసరికి అతిపెద్ద సవాలుగా మారుతుంది.
మీకు ఆదాయం వచ్చినప్పుడు మరింత ఎక్కువగా సంపాదించేలా మిమ్మల్ని ప్రోత్సహించే వాటిపైనే తొలి ప్రాధాన్యతగా పెట్టుబడి పెట్టండి. మీ నైపుణ్యాలను పెంచే ఒక కొత్త కోర్సు, మెరుగైన ల్యాప్టాప్, మీ రంగానికి సంబంధించిన మంచి పుస్తకం లేదా మీ సమయాన్ని ఆదా చేసే సాధనాల వంటి వాటికి ఖర్చు చేయండి. అవి మీ సామర్థ్యాన్ని పెంచి, భవిష్యత్తులో మీ సంపాదనను మరింత పెంచుతాయి.
క్షణికమైన ఆవేశాలు, భావోద్వేగాలు జీవిత కాలపు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. అందుకే, కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ఆగిపోవడమే మనం చేసే అత్యంత తెలివైన ఆర్థిక నిర్ణయం అవుతుంది. భావోద్వేగాలపై మనకు ఎంత ఎక్కువ నియంత్రణ ఉంటే.. డబ్బుపై మనకు అంతటి పట్టు లభిస్తుంది.
జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే.. మన ఆలోచనలు, అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఎప్పుడూ చేసే పనులే చేస్తూ కొత్త ఫలితాలను ఆశించడం సరికాదు. మన కంఫర్ట్ జోన్ దాటినప్పుడే అసలైన ఎదుగుదల మొదలవుతుంది. మనకు ఇప్పటివరకు దక్కని విజయం కావాలంటే, ఇదివరకు ఎన్నడూ చేయని విధంగా సరికొత్తగా ప్రయత్నించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.